Advertisement

'బాహుబలి'ని కూడా క్రాస్ చేసింది..!

Sat 23rd Dec 2017 04:27 PM
vikram veda,crossed,baahubali,top films 2017  'బాహుబలి'ని కూడా క్రాస్ చేసింది..!
Vikram Veda Crossed Baahubali 'బాహుబలి'ని కూడా క్రాస్ చేసింది..!
Advertisement

ఇక '2.0' దాకా రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రానికి తిరుగేలేదని అందరూ భావించారు. బహుశా బాలీవుడ్‌లో రూపొందుతున్న 'పద్మావతి' శంకర్‌, రజనీ, అక్షయ్‌కుమార్‌ల '2.0' మాత్రమే 'బాహుబలి'ని క్రాస్‌ చేయగలవని అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే 'బాహుబలి' చిత్రం యాహూ, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌.. ఇలా అన్నింటి రికార్డులను, సెర్చ్‌ ఇంజన్లను తన పేరుతోనే లిఖించుకుంది. ఇక తమిళంలో మాధవన్‌, విజయ్‌సేతుపతి నటించిన 'విక్రమ్‌ వేదా' రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా మాధవన్‌, గ్యాంగ్‌స్టర్‌గా విజయ్‌సేతుపతి నటించిన ఈ చిత్రానికి గాయత్రి-పుష్కర్‌ అనే దర్శకద్వయం డైరెక్షన్‌ చేశారు. వీరికి ఇది తొలి చిత్రమే అయినా ఈ చిత్రం తమిళనాట సంచలనాలు నమోదు చేసింది. దీంతో ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, రానాలతో రీమేక్‌ చేయాలని భావించారు. ఆ తర్వాత నాగార్జున-మాధవన్‌లు నటిస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఎందుకనో విక్రమ్‌ భేతాళ్‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై మనవారు ఆసక్తి చూపలేదు. ఇక తాజాగా 2017వ సంవత్సరానికి గాను దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి 'ఐఎండీబీ' అంటే 'ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌' టాప్‌ 10 ఇండియన్‌ చిత్రాల వివరాలను వెల్లడించింది. ఇందులో మొదటి స్థానం 'విక్రమ్‌ వేదా'కి దక్కగా, 'బాహుబలి' చిత్రం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మూడో చిత్రంగా తెలుగు నాట సంచలన విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి' నిలిచింది. నాలుగైదు స్థానాలలో అమీర్‌ఖాన్‌ 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌', ఇర్ఫాన్‌ఖాన్‌ 'హిందీ మీడియం'లు నిలిచాయి. ఇక రానా నటించిన 'ఘాజీతో పాటు అక్షయ్‌కుమర్‌ నటించిన 'టాయిలెట్‌- ఏక్‌ ప్రేమ్‌ కథా', 'జాలీ ఎల్‌ఎల్‌బి, 9వ స్థానంలో విజయ్‌ 'మెర్శిల్‌', పదో స్థానంలో మమ్ముట్టి నటించిన 'ది గ్రేట్‌ ఫాదర్‌'లు ఉన్నాయి. ఈ ఏడాది ఈ జాబితాలో షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం...! 

Vikram Veda Crossed Baahubali:

R Madhavan's Vikram Vedha beats Prabhas Baahubali 2: The Conclusion to be the top film of 2017

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement