కోలీవుడ్ హీరోలందరూ అర్జున్ రెడ్డి లుక్ లో!

Sat 23rd Dec 2017 02:44 PM
vijay devarakonda,post,kollywood,stars,arjun reddy look  కోలీవుడ్ హీరోలందరూ అర్జున్ రెడ్డి లుక్ లో!
Kollywood Stars in Vijay Devarakonda Arjun Reddy Look కోలీవుడ్ హీరోలందరూ అర్జున్ రెడ్డి లుక్ లో!
Sponsored links

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించి సెన్సేషన్ అయ్యిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో విజయ్ నటన యావత్ యూత్ ని ఒక ఊపు ఊపేసింది. అసలు యూత్ అయితే అర్జున్ రెడ్డి మ్యానియా నుండి ఇప్పటివరకు బయటికి రాలేదంటే ఆ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అర్ధమవుతుంది. ఈ సినిమాలో విజయ్ అర్జున్ రెడ్డి పాత్రలో జీవించాడు.

అతని గెటప్ అయితే యూత్ కి విపరీతంగా ఎక్కేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు అనేక భాషల్లో రీమేక్ అవుతుంది. తమిళంలో అయితే విక్రమ్ తమ కొడుకు ధృవ్ ని ఏకంగా అర్జున్ రెడ్డి రీమేక్ తోనే వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ మాదిరిగా గెడ్డం అన్ని పెంచుకుని ధృవ్ ఎలా వుండబోతున్నాడో తెలియదు గాని... ఇప్పుడు తమిళ సూపర్ స్టార్స్ అంతా విజయ్ అర్జున్ రెడ్డి గెడ్డం లుక్ లో ఎలా వుంటారో అనేది వారి వారి ఫొటోస్ ని అర్జున్ రెడ్డి లుక్ లోకి మార్ఫింగ్ చేసి.. హీరోలందరి ఫోటోని ఒకే పిక్ లో పెట్టి సోషల్ మీడియాలో వదిలారు.

మరి కోలీవుడ్ స్టార్ హీరోలకు బాగా కనెక్ట్ అయిన అర్జున్ రెడ్డి మార్ఫింగ్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఇక ఆ పిక్ లో కమల్ హాసన్, రజినీ కాంత్, విక్రమ్, సూర్య, అజిత్, విజయ్, విజయ్ సేతుపతి, ధనుష్, వంటి స్టార్స్ అర్జున్ రెడ్డి గెడ్డం లుక్ లో కనిపిస్తూ ఇరగదీస్తున్నారు. వారందరిలో ఈ అర్జున్ రెడ్డి లుక్ రజినీ కాంత్ కి బాగా సెట్ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ ఫోట్ ని విజయ్ దేవరకొండ కూడా షేర్ చేశాడు.

Sponsored links

Kollywood Stars in Vijay Devarakonda Arjun Reddy Look:

Vijay Devarakonda Posted A Great Pic

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019