ఎంతమంది వచ్చినా మొదటి ప్రేమే తొలిప్రేమ!

Wed 20th Dec 2017 11:16 PM
tholi prema teaser,varun tej,venki,raashi khanna  ఎంతమంది వచ్చినా మొదటి ప్రేమే తొలిప్రేమ!
Tholi Prema Teaser Report Review ఎంతమంది వచ్చినా మొదటి ప్రేమే తొలిప్రేమ!
Sponsored links

‘ఫిదా’తో విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్.... మరోసారి ప్రేమ కథ ద్వారానే ప్రేక్షకులని అలరించాలని చూస్తున్నాడు. వరుణ్ తేజ్ - రాశిఖన్నా జంటగా తెరకెక్కుతున్న తొలిప్రేమ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు సమయం ఉన్నప్పటికీ తొలిప్రేమ టీజర్ ని ఈరోజు బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం.

మనిషి జీవితంలో తొలిసారి ప్రేమించిన అమ్మాయి విలువను చెపుతూ ఈ టీజర్ ఉంది. 'మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా.. మొదట ప్రేమించిన అమ్మాయిని.. ఎప్పటికీ మర్చిపోలేం'.. అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ ని బట్టి చూస్తుంటే.. ఈ సినిమా పూర్తి ప్రేమకథా చిత్రం అనే విషయం అర్ధమవుతుంది. అసలు తొలిప్రేమ అనే టైటిల్ లోనే అది రివీల్ అయినప్పటికీ... ఇప్పుడు టీజర్ తో కాస్త అర్ధమయ్యేలా క్లారిటీ ఇచ్చారు. 

ఇక వరుణ్ తేజ్ మరీ కొత్తగా కాకపోయినా... కాస్త డిఫరెంట్ లుక్ తోనే ఈ సినిమాలో కనబడుతున్నాడు. ఇకపోతే తొలిప్రేమలోని హీరోయిన్ రాశి ఖన్నా లుక్ ని మాత్రం రివీల్ చెయ్యలేదు. అలాగే ఈ సినిమాకి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ టీజర్ వరకు అదిరిపోయింది. ఈ సినిమా 2018 ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

Click Here For Tholi Prema Teaser 

Sponsored links

Tholi Prema Teaser Report Review:

Varun Tej’s new film Tholi prema in the direction of debutant Venky Atluri and bankrolled by BVSN Prasad has got the teaser out just a while back.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019