Advertisementt

శంకర్ ని తట్టుకోలేకే దిల్ రాజు తప్పుకున్నాడా?

Wed 20th Dec 2017 01:22 AM
dil raju,shankar,not produced,indian 2 movie  శంకర్ ని తట్టుకోలేకే దిల్ రాజు తప్పుకున్నాడా?
Dil Raju About Indian 2 Movie శంకర్ ని తట్టుకోలేకే దిల్ రాజు తప్పుకున్నాడా?
Advertisement
Ads by CJ

శంకర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించిన 2 .0  సినిమాని విడుదలకు సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నాడు. శంకర్ 2.0  సినిమా తర్వాత కమల్ హాసన్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఇండియన్ 2 చిత్రాన్ని గ్రాండ్ గా ఎనౌన్స్ కూడా చేశారు. తమిళ్ లో కమల్ హాసన్ బిగ్ బాస్ రియాల్టి షో చేస్తున్న టైమ్ లో.. ఆ షో ఫైనల్స్ లో ఈ విషయాన్ని గ్రాండ్ గా ప్రకటించారు. కేవలం ఆ ప్రకటన కోసమే హైదరాబాద్ నుంచి చెన్నై కూడా వెళ్లాడు దిల్ రాజు. అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది. కానీ ఇప్పుడు రివర్స్ లో ఈ న్యూస్ హాట్ హాట్ గా మారింది. అవును.. ఇండియన్ 2 సినిమా నుంచి  దిల్ రాజు తప్పుకున్నాడు.

అయితే దిల్ రాజు తాను ఇండియన్ 2 చేయట్లేదని... నాకున్న ప్రస్తుతం ప్రాజెక్టుల వల్ల అంత పెద్ద సినిమా చేయలేను. ఇప్పుడు కమిట్ అయిన సినిమాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. శంకర్ పిలిస్తేనే చెన్నై వెళ్లాను. నా శ్రేయోభిలాషులు ఫోన్ చేసి నన్ను మందలించారు. తెలుగులో సక్సెస్ ఫుల్ గా ఉన్నప్పుడు ఆలిండియా సినిమా అవసరమా అన్నారు. నెక్ట్స్ ఇయర్ సినిమాలపై ఫోకస్ పెట్టకుండా ఇదేంటని తిట్టారు. నా మెంటాలిటీకి నేను స్క్రిప్ట్ లో కలుగజేసుకుంటాను. ఇండియన్ 2లో నాకు ఆ స్కోప్ లేదు. అదొక సినిమా మాత్రమే అవుతుంది. దిల్ రాజు మూవీ కాదు..అంటూ ఎంసీఏ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ఇండియన్ 2 ని వదిలేసిన విషయం చెప్పాడు.

అయితే దిల్ రాజు అలా ఇండియన్ 2 ని వదిలెయ్యడానికి దర్శకుడు శంకర్ అనే కారణాలు వినబడుతున్నాయి. శంకర్ భారీ తనం, ఆయకున్న భారీ డిమాండ్స్ తీర్చడం దిల్ రాజు వల్ల అయ్యే పని కానందున దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చి.. ఇలా కావాలనే బయటికొచ్చినట్టుగా చెబుతున్నాడని కామెంట్స్ వినబడుతున్నాయి.

Dil Raju About Indian 2 Movie:

Dil Raju Not Produced Indian 2 Movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ