Advertisementt

అజ్ఞాతవాసికి అన్నీ కలిసొస్తున్నాయ్!

Tue 19th Dec 2017 02:06 PM
pawan kalyan,agnathavasi,fans,no compitation,good news  అజ్ఞాతవాసికి అన్నీ కలిసొస్తున్నాయ్!
No Compitation to Agnathavasi అజ్ఞాతవాసికి అన్నీ కలిసొస్తున్నాయ్!
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతి అంటే సినీ ప్రేక్షకులకే కాదు నార్మల్ ఆడియెన్స్ కి కూడా పెద్ద పండగ. చాలా మంది నిర్మాతలు ఈ పండగ కోసం వెయిట్ చేసి వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసి క్యాష్ చేసుకుందాం అని చూస్తారు. కానీ అజ్ఞతావాసి దెబ్బకి సంక్రాంతి రేస్ లో వున్న సినిమాలు అన్ని వెనక్కి వెళ్లిపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై హై ఎక్సపెక్టేషన్స్ వున్నాయి. వచ్చే నెల జనవరి 10 న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది అజ్ఞాతవాసి సినిమా.

చాలా కాలం క్రితం సంక్రాంతికి భరత్ అనే నేను వస్తుంది అనుకున్నారు. కానీ అంతలోనే అది సమ్మర్ కు జారుకుంది. రంగస్థలం కూడా ముందు సంక్రాంతి కే వద్దాం అనుకున్నారు కానీ... అజ్ఞాతవాసి వల్ల వెనక్కి వెళ్ళింది. రోబో 2 లాంటి పెద్ద సినిమా సంక్రాంతి తర్వాత వస్తుందనుకుంటే అది ఏప్రిల్ కు జరిగింది. ఇక ఈ సంక్రాంతి రేస్ లో అజ్ఞాతవాసితో పాటు సూర్య సినిమా గ్యాంగ్ ఒక్కటే పోటీకి రెడీగా వుంది. బాలయ్య జై సింహ మూవీ ముందు నుండే సంక్రాంతికి రిలీజ్ అన్నారు కానీ... ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. హోప్స్ లేవు.

కనీసం పైసా వసూల్ కు వచ్చిన బజ్ లో కానీ చేసిన హడావుడిలో పదిశాతం కూడా కనిపించడం లేదు. తమిళ్ హీరో విశాల్ అభిమన్యుడు కూడా వాయిదా పడి జనవరి 26 కి వెళ్ళిపోయింది. ఇక రవితేజ టచ్ చేసి చూడు కూడా దాదాపు వాయిదా పడిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో 9వ తేదీ రాత్రి నుంచి 25వరకు దాదాపు పదిహేను రోజులు రఫ్ఫాడించే అవకాశంఉంది. దీన్ని బట్టి అజ్ఞాతవాసికి అస్సలు ఎదురే లేదు అని చెప్పొచ్చు.

No Compitation to Agnathavasi:

Good News to Agnathavasi Fans

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ