ఈ ఫైర్‌బ్రాండ్‌ మాటల్లో వాస్తవముంది!

Sat 16th Dec 2017 04:15 PM
kangana,zaira wasim,molestation case,sexual harassment  ఈ ఫైర్‌బ్రాండ్‌ మాటల్లో వాస్తవముంది!
Kangana Ranaut on sexual harassment ఈ ఫైర్‌బ్రాండ్‌ మాటల్లో వాస్తవముంది!

ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలన నటిగా, వ్యక్తిగత జీవితంలో కూడా ఫైర్‌బ్రాండ్‌గా, అలాంటి పాత్రలను చేసే నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ కంగనారౌనత్‌. ఈమె మహిళాసాధికారికత, మహిళా స్వేచ్చతో పాటు ఎన్నో విషయాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫెమినిస్ట్‌గా పేరు తెచ్చుకుంటోంది. తనను కూడా సినిమాలలో చాన్స్‌ల కోసం చాలా మంది లైంగిక సుఖం కోరారని, తాను ఒకానొక దశలో పోర్న్‌ స్టార్‌ని కావాలనే నిర్ణయానికి కూడా వచ్చానని బహిరంగంగా ప్రకటించింది. 

ఇక తాజాగా ఆమె 'దంగల్‌' ఫేమ్‌ జైరా వసీంకి మద్దతు తెలిపింది. ఇటీవల 'దంగల్‌' ఫేమ్‌ జైరా వసీం విమానంలో వెళుతుంటే తోటి ప్రయాణికుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే విషయం జైరా వసీం స్వయంగా చెప్పడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక నెటిజన్లు కొందరైతే హీరోయిన్‌లకి ఇలాంటివి మామూలే. బికినీలు వేసి రెచ్చగొడుతూ ఉంటే ఇలాగే జరుగుతాయి. జైరా వసీం చేసింది తప్పు. ముందుగా మనం మన విషయంలో స్వయం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై కంగనా రౌనత్‌ నోరు విప్పింది. 

ఇప్పటికే ఆమె హృతిక్‌ రోషన్‌ వివాదంలో పీకల్లోతుల్లో కూరుకుపోయి నానా గొడవ చేస్తోంది. తాజాగా జైరా వసీం ఘటనను ఆమె దృష్టిలో పెట్టుకుని, ఓ మహిళ తనకు జరిగిన విషయాన్ని, లైంగిక వేధింపుల గురించి పబ్లిగ్గా చెప్పడం ఎందుకు తప్పు అవుతుంది? అలా చెప్పే దైర్యం చూసి మెచ్చుకోవాలే గానీ ఆమెపైనే తప్పు రుద్దిలే ఎలా? ఆ స్థానంలో నేను ఉంటే అతడి కాళ్లను విరగొట్టే దానిని. అలాంటి దుస్తులు వేసుకోవద్దు... ఫలానా సమయంలో బయటకు వెళ్లవద్దు అని అందరు చెప్పడం తప్పు. తల్లిదండ్రులు ఎక్కువ మంది తమ ఆడపిల్లలకు అదే చెబుతున్నారని, బయట పోకిరీలు చేసే దానికి మేమెందుకు బలి కావాలి? మేం వాటికి ఎందుకు బాధ్యులం కావాలి? ఒక మనిషి వేసే దుస్తులు, చేసే పనులు ఓ మగాడి లైంగిక వేధింపులకు ఎలా కారణం అవుతాయో నాకు అర్ధం కావడం లేదు. లైంగిక వేధింపులకు గురవుతున్నవారు ఆ విషయాలను ఎందుకు బయటికి చెబుతున్నారని ప్రశ్నించడం.. తప్పు అని చెప్పుకొచ్చింది. 

ఇక ఇంతకు ముందు కంగనా కూడా తనపై జరిగిన లైంగిక వేధింపులు గురించి చెప్పి ఫలానా వ్యక్తులు అని చెప్పకుండా అందరూ అదేటైప్‌ అనేలా మాట్లాడింది. ఇప్పటికైనా కంగనా ధైర్యంగా తనకు లైంగిక వేధింపులు ఎవరి నుంచి వచ్చాయో చెబితే మంచిది...!

Kangana Ranaut on sexual harassment:

Kangana on Zaira Wasim Molestation Case