భరత్ విషయం లో అన్ని గాలివార్తలేనా?

Fri 08th Dec 2017 07:09 PM
mahesh babu,allu arjun,bharat ane nenu,naa peru surya  భరత్ విషయం లో అన్ని గాలివార్తలేనా?
Rumours on Mahesh Babu Movie భరత్ విషయం లో అన్ని గాలివార్తలేనా?
Sponsored links

ఈ మధ్యన '2 .0' నిర్మాతలు తమ సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుంది అని చెప్పక ముందు నుండే మహేష్ 'భరత్ అనే నేను' నిర్మాతలకు, అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' నిర్మాతలకు మధ్యన సినిమాల విడుదల తేదీ విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అలా వారు గొడవలు పడుతున్న సమయంలోనే లైకా ప్రొడక్షన్స్ వారు తమ '2 .0' సినిమా ఏప్రిల్ లో విడుదల అనేసరికి భరత్ నిర్మాతలు, 'నా పేరు సూర్య' నిర్మాతలు ఒక్కటై లైకా వారి మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత చేసేది లేక 'భరత్ అనే నేను' సినిమాని దానయ్య ఏప్రిల్ 27 నుండి రెండు వారాలు ముందుకు జరిపి ఏప్రిల్ 13  నే విడుదల చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.

అంతేకాకుండా దర్శకుడు కొరటాల శివ 'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ ని మహేష్ అభిమానుల కోసం న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చెయ్యబోతున్నాడంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు 'భరత్ అనే నేను' సినిమా విడుదల ఏప్రిల్ 13 అన్నది నిజం కాదని.. అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్ గా 'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ కూడా విడుదల కావడం లేదని.. అవన్నీ కేవలం గాలి వార్తలే అంటున్నారు.  ఇలా అన్నది కూడా ఎవరో కాదు 'భరత్ అనే నేను' నిర్మాతలే ఈ విషయమై క్లారిటీ ఇచ్చారంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతానికి మహేష్ 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకూ తమిళనాడులోని 'కారైకుడి'లో ఈ షెడ్యూల్ జరగనుంది అని... అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తాం అనీ భరత్ నిర్మాతలు చెబుతున్నారు.అంతేకాకుండా  వచ్చేనెలలో ఒక ఫైట్ ను.. 3 పాటలను చిత్రీకరించనున్నారట.

Sponsored links

Rumours on Mahesh Babu Movie:

Rumours on Mahesh Babu Bharat Ane Nenu Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019