నాగ్, అఖిల్.. భలే ప్రమోట్‌ చేస్తున్నారుగా!

Wed 06th Dec 2017 11:55 PM
nagarjuna,akhil akkineni,hello movie,promotion  నాగ్, అఖిల్.. భలే ప్రమోట్‌ చేస్తున్నారుగా!
Nagarjuna and Akhil Promotes Hello Movie నాగ్, అఖిల్.. భలే ప్రమోట్‌ చేస్తున్నారుగా!
Sponsored links

నాగార్జున ఏది చేసినా విభిన్నంగానే ఉంటుంది. ఆయన తమ చిత్రాలను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలనే విషయంలో దాదాపు పీహెడీ చేశాడని చెప్పవచ్చు. ఇక సాధారణంగా హీరోలు, వారి వారసులు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వారు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఏయే విషయాలు ప్రస్తావనకు వస్తాయనే అంశాలు అందరిలో ఆసక్తిని రేపుతాయి. ఇటీవల రామ్‌చరణ్‌, చిరంజీవిలు కలిసి కాఫీ షాప్‌లో సుదీర్ఘ చర్చల్లో మునిగి పోయిన ఫోటోకి ఎంతో రెస్పాన్స్‌ లభించింది. ఇప్పుడు అదే తరహా ప్రమోషన్‌ని నాగ్‌,అఖిల్‌ చేస్తున్నారు. వీరిద్దరు ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్న మాటలు అందరినీ అలరిస్తూ ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

అఖిల్‌ మొదటగా ట్వీట్‌ చేస్తూ... ఇప్పుడే 'హలో'కి సంబంధించిన పాటల ఫైనల్‌మిక్సింగ్‌ని చూశాను. అద్భుతంగా ఉన్నాయి ఆడియో విడుదలయ్యే వరకు వెయిట్‌ చేయలేను. సమ్‌థింగ్‌.. ఏదైనా షేర్ చేసుకుంటాను. అని చెప్పాడు. దానికి ఆయన తండ్రి నాగార్జున స్పందిస్తూ.. 'ఒరేయ్‌ .. నీ చిత్రంలోని పాటను ఇలా రిలీజ్‌ చేస్తున్నావని నాకెందుకు చెప్పలేదు. ఆ పాట ఇదేనా' అంటూ తన ఫోన్‌లో ఉన్న ఓపాట క్లిప్పింగ్‌ని పోస్ట్‌ చేశాడు. దానికి అఖిల్‌.. 'నాన్నా.. నువ్వు ఆ పాటని రికార్డింగ్‌ చేసినట్లు నాకెందుకు చెప్పలేదు. ఆడియో వేడుక దాకా వెయిట్‌ చేయలేక అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను' అని బదులిచ్చాడు. కాగా ఈ చిత్రం ఆడియో ఈనెల 10వ తేదీన వైజాగ్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 

అక్కినేని హీరోలకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి క్రేజ్‌ ఉంది. దాంతో నాగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ అందించిన ట్యూన్స్‌ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ - అనూప్‌రూబెన్స్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'ఇష్క్‌, మనం' చిత్రాలలో పాటలు కూడా ఎవర్‌గ్రీన్‌ అనిపించాయి. సో.. 'హలో' సాంగ్స్‌తో విక్రమ్‌-అనూప్‌లు కలిసి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 22న క్రిస్మస్‌ కానుకగా రిలీజ్‌ చేయనున్నారు..! 

Sponsored links

Nagarjuna and Akhil Promotes Hello Movie:

Nagarjuna and Akhil Used Twitter For Hello Promotion

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019