Advertisement

టాక్‌ బాగా వచ్చినా.. టార్గెట్‌ మిస్సయింది!

Sun 26th Nov 2017 02:43 PM
vunnadhi okate zindagi,positive talk,ram,kishore tirumala,loss project  టాక్‌ బాగా వచ్చినా.. టార్గెట్‌ మిస్సయింది!
Vunnadhi Okate Zindagi Target Missed టాక్‌ బాగా వచ్చినా.. టార్గెట్‌ మిస్సయింది!
Advertisement

కొన్ని చిత్రాలకు డివైడ్‌టాక్‌ వచ్చినా.. నెగటివ్‌ టాక్‌ వచ్చినా అద్భుతమైన వసూళ్లు సాధిస్తాయి. ఇది చిన్నచిత్రాల నుంచి పెద్ద చిత్రాల వరకు గమనించవచ్చు. దానికి ఉదాహరణ 'రాజు గారి గది' పార్ట్‌1 నుంచి 'సరైనోడు, డిజె' వరకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక కొన్ని చిత్రాలకు మంచి టాక్‌ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు ఉండవు. 'ధృవ'కి మంచి టాకే వచ్చింది. డీమానిటైజేషన్‌ వల్ల వసూళ్లు తగ్గాయని చెబుతారు గానీ అది నిజం కాదు. ఎందుకంటే నోట్ల రద్దు సమయంలో ముందుగా వచ్చిన నిఖిల్‌ నటించిన 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' వంటి చిత్రమే కాసుల వర్షం కురిపించింది. ఈ రోజుల్లో పాటిటివ్‌ టాక్‌ రావడమే గగనమైపోతోంది. కానీ పాజిటివ్‌ టాక్‌ వచ్చినా నష్టపోయిన చిత్రాలలో నారా రోహిత్‌, శ్రీవిష్ణు నటించిన 'అప్పట్లో ఒకడుండే వాడు, పీఎస్వీగరుడ వేగ నుంచి ఉన్నది ఒకటే జిందగీ' వరకు అదే పరిస్థితి.

ఇక 'ఉన్నది ఒకటే జిందగీ' విషయానికి వస్తే కాస్త స్లో నెరేషన్‌ అనిపించినా అందరూ మంచిఫీల్‌ గుడ్‌ చిత్రంగా ఉందని, 'ఫిదా'లాగా ఆకట్టుకోవడం ఖాయమని భావించారు. ఆ టాక్‌కి తగ్గట్లే మొదటి మూడు రోజుల వీకెండ్‌లోనే 11కోట్ల షేర్‌ వసూలు చేసింది. సో... సినిమా విజయం సాధించడం ఖాయమని భావించారు. కానీ మొదటి మూడు రోజుల తర్వాత ఈ సినిమా ఫుల్‌ రన్‌లో మరో 6కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే 17కోట్ల వద్ద నిలిచిపోయింది. ఈ చిత్రం హిట్‌ కాంబినేషన్‌లో 'నేను..శైలజ' తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎక్కువ రేట్లకు కొన్నారు. 22కోట్ల బిజినెస్‌ జరిగింది. కానీ చివరకి చూస్తే 5కోట్ల నష్టంతో ఫ్లాప్‌గా మిగిలింది. 

దీనిని బట్టి రామ్‌కి స్టార్‌ స్టామినా పెద్దగా లేదని రుజువైంది. దీంతో రామ్‌ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌గా 'సినిమా చూపిస్తా మావా, నేను లోకల్‌' దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చిత్రం చేయనున్నాడు. 'నేను లోకల్‌'లో పెట్టుకున్న కీర్తిసురేష్‌నే డైరెక్టర్‌ ఈ సినిమాకి కూడా రామ్‌ సరసన హీరోయిన్‌గా ఖరారు చేసుకున్నాడు. సో.. ఈ చిత్రమైనా కీర్తిసురేష్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయి రామ్‌కి హిట్‌ని అందిస్తుందో లేదో చూడాలి...!

Vunnadhi Okate Zindagi Target Missed:

Vunnadhi Okate Zindagi 5 Crs Loss Project

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement