Advertisement

సుమ సంపాదిస్తుందిగా.. ఇంకేంటి..?

Sun 26th Nov 2017 07:32 AM
rajeev kanakala,commnets,movies,snehamante idera  సుమ సంపాదిస్తుందిగా.. ఇంకేంటి..?
Rajeev Kanakala Sensation Commnets on his Movie Chances సుమ సంపాదిస్తుందిగా.. ఇంకేంటి..?
Advertisement

దేవదాసు కనకాల మంచి నటుడే కాదు.. 'చలిచీమలు' వంటి అద్భుతమైన చిత్రాన్ని ఆయన తీశాడు. ఇక ఆయన శ్రీమతి లక్ష్మీదేవి కనకాల నటనలో శిక్షణ ఇస్తుంది. చిరంజీవి నుంచి రజనీకాంత్‌ వరకు ఆమె పర్యవేక్షణలో యాక్టింగ్‌ నేర్చుకున్న వారే. ఇక వీరికి ఓ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఉంది. కానీ నేడు అది విద్యార్దులే లేక వెలవెల బోతోంది. వారి పిల్లలే రాజీవ్‌కనకాల, శ్రీలక్ష్మి కనకాల. శ్రీలక్ష్మి కనకాల ఇప్పటికీ టీవీ సీరియల్స్‌లో తల్లి పాత్రల వంటివి చేస్తోంది. ఇక రాజీవ్‌ కనకాల చిన్నవయసులోనే టివీసీరియల్స్‌, షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించాడు. ఆ తర్వాత వెండితెరపై చిన్నచిన్నవేషాలు వేస్తూ లోబడ్జెట్‌ చిత్రాలలో ప్రధాన పాత్రలను కూడా పోషించాడు. 'విశాఖ ఎక్స్‌ప్రెస్‌, ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌', 'రాజుగారి గది', 'ఆనందోబ్రహ్మ'తో పాటు తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విజేత శివబాలాజీతో 'స్నేమహంటే ఇదేరా' అనే చిత్రం ఇద్దరు హీరోలుగా నటించారు. మొదట్లో ఈయనకి జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళిల వల్ల ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన పలు వ్యసనాలకు బానిస అయినట్లు చెబుతారు. ఓ చిత్రం ప్రివ్యూ షోకి వచ్చి తాగి పడిపోయాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏదిఏమైనా ఆయనను ఇప్పుడు ఎన్టీఆర్‌, రాజమౌళి వంటి వారు కూడా పట్టించుకోవడం లేదు. 

నిజంగా 'విక్రమార్కుడు' చిత్రంలో ఆయనకు ఓ పోలీస్‌ పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది ఆ పాత్రను రాజీవ్‌కి ఇచ్చారు. కానీ ఆయనకు ప్రొఫెషనలిజం లేదని అంటారు. మరోవైపు ఈ ఇంట్లో ఎవ్వరికీ పెద్దగా సంపాదన లేకపోవడంతో అన్ని కూడా ఆయన భార్య సుమ కనకాలనే జరుపుతోందని తెలుస్తోంది. ఈ భార్యాభర్తలు తాజాగా టీవీ షోల కోసం ఓ ప్రొడక్షన్‌ కంపెనీని కూడా స్థాపించారు. దానికి తోడు సుమ బాగా సంపాదిస్తుండటంతో రాజీవ్‌ ఆమె సంపాదనతో ఎంజాయ్‌ చేస్తుంటాడని అంటారు. ఇక తాజాగా రాజీవ్‌ కనకాల మాత్రం తన ప్రతిభకు తగ్గ పాత్రలు, అవకాశాలు రాకపోవడంపై మాట్లాడుతూ, నేను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తెలిసిన అందరికీ ఫోన్‌ చేసి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని కుశల ప్రశ్నలు వేస్తూ ఛాన్స్‌లు అడగను, ఎవ్వరికీ నేను అందుబాటులో కాంటాక్ట్‌లో కూడా ఉండకపోవడం దీనికి కారణం కావచ్చు. 

నేను స్నేహితులను కలుస్తుంటాను. ఎన్నో మాట్లాడి సరదాగా గడుపుతాం. కానీ ఆ సమయంలో నేను ఎవ్వరినీ ఏమీ అడగను, స్నేహం వేరు, ప్రొఫెషన్‌ వేరు అనేది నా ఫీలింగ్‌, స్నేహం పేరుతో ఫ్రొఫెషన్‌లో నేను లబ్ది పొందాలని చూడను. ఈ విషయం నాకు చాలా కాలం కిందటే తెలిసింది. అయినా ఆత్మని చంపుకోలేక ఇలాగే ఉన్నాను. ఇంత కాలం జరిగింది కదా...! మరికొంత కాలం ఇలాగే ఉంటే సరిపోతుంది. దానికోసం ఆత్మాభిమానం చంపుకోవడం ఇష్టం లేదు. ఆ విషయంలో నాదే తప్పు అయినా నేనింతే.. అని చెప్పుకొచ్చాడు.

Rajeev Kanakala Sensation Commnets on his Movie Chances:

Rajeev Kanakala About His Movies

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement