'జై సింహా' ఈస్ట్ గోదావరి షాకింగ్ ఫిగర్!

Wed 15th Nov 2017 06:47 PM
balakrishna,ks ravikumar,jai simha,business,east godavari  'జై సింహా' ఈస్ట్ గోదావరి షాకింగ్ ఫిగర్!
Jai Simha East Godavari Shocking Business 'జై సింహా' ఈస్ట్ గోదావరి షాకింగ్ ఫిగర్!
Sponsored links

నందమూరి బాలకృష్ణ 'జై సింహా' సినిమాకి ముందు 20 - 25 కోట్ల మార్కెట్ జరిగింది. అయితే 'శాతకర్ణి'  సినిమా తర్వాత ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. 'శాతకర్ణి'  సినిమా ఏకంగా 50 కోట్ల షేర్ చేయడంతో.... బాలయ్య కూడా 50 కోట్ల క్లబ్ లో చేరి తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఈయన చేస్తున్న సినిమాలు కూడా భారీ ధర పలుకుతున్నాయి. అయితే ప్రస్తుతం తాను నటిస్తున్న 'జై సింహా' సినిమా కూడా మంచి రేట్ పలుకుతుంది అని టాక్.రీసెంట్ గా వచ్చిన 'పైసా వసూల్' 46 కోట్లమేర బిజినెస్  చేయగా..ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ 'జై సింహా' కూడా 50 కోట్లు ప్రీ బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

అయితే ఈ సినిమా రైట్స్ కొన్ని ఏరియాస్ లో బాలయ్య గత చిత్రాలకంటే ఎక్కువ రేట్లకే అమ్ముడుపోయాయంట. ఇప్పటికే ఈస్ట్ గోదావరికి సంబంధించి ఓ డిస్ట్రిబ్యూటర్ 'జై సింహా'ని  2.75 కోట్లకి కొన్నాడట. అయితే ఇది బాలయ్య కెరీర్ లో రికార్డు ఫిగర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ కి వచ్చిన ఆదరణ వల్లే ఈ ధరకి అమ్ముడుపోయిందని తెలుస్తుంది.

కె.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు బాలయ్య సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో పూర్తి చేసుకుని హైదరాబాద్ లో మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. 

Sponsored links

Jai Simha East Godavari Shocking Business:

Balakrishna Jai Simha Movie Business Starts 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019