Advertisement

'ఈశ్వర్‌' నుంచి 'సాహో' వరకు...!

Sun 12th Nov 2017 11:04 AM
prabhas,bahubali,director sujeeth,sahoo movie  'ఈశ్వర్‌' నుంచి 'సాహో' వరకు...!
Darling Prabhas Completes 15 Years Cine Journey 'ఈశ్వర్‌' నుంచి 'సాహో' వరకు...!
Advertisement

నాటి హీరోలకి 15ఏళ్ల కెరీర్‌ అంటే ఎంతో ఇంపార్టెన్స్‌. వందల చిత్రాలలో నటించేసేవారు. కానీ ప్రభాస్‌ సినీ కెరీర్‌ ఒకటిన్నర దశాబ్దం కెరీర్‌ని పూర్తి చేసుకున్నాడు. ఆయన తన పెదనాన్న కృష్ణంరాజు వారసునిగా వచ్చినప్పటికీ ఆయన తన పెదనాన్న క్రేజ్‌ని వాడుకుంది నామమాత్రంగానే. 2002 నవంబర్‌ 11న ఆయన జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో నటించిన మొదటి చిత్రం 'ఈశ్వర్‌' విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన 'రాఘవేంద్ర' పరాజయ పాలైంది. మూడో చిత్రంగా ఎమ్మెస్‌ రాజు నిర్మాతగా శోభన్‌ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రం ఆయనకు తొలి సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. కానీ ఆ తర్వాత మరలా 'పౌర్ణమి, చక్రం, బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్‌'వంటి చిత్రాలు నిరుత్సాహపరిచాడు. 

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పటివరకు కేవలం మాస్‌ ఆడియన్స్‌కే కనెక్ట్‌ అయిన ప్రభాస్‌కి యూత్‌, ఫ్యామిలీ, లేడీ ఫాలోయింగ్‌లను తెచ్చిపెట్టిన చిత్రాలుగా 'డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'లని చెప్పాలి. ఇక కొరటాల శివను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆయన నటించిన 'మిర్చి' చిత్రం ఆయన కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత ఆయన ఎంతో కష్టపడి, రాజమౌళిని నమ్మి ఆయనకు నాలుగైదేళ్లు రాయించేశాడు. దాంతో 'బాహుబలి-ది బిగినింగ్‌' రూపొంది 600కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ ఏడాదే వచ్చిన 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం ఏకంగా ఇండియాలోనే 1200కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్‌ని నేషనల్‌ ఐకాన్‌గా మార్చింది. 

ఇక ప్రస్తుతం ఆయన తాను 'మిర్చి' చేసిన తన స్వంతబేనర్‌ వంటి యువి క్రియేషన్స్‌ బేనర్‌లోనే 150కోట్ల భారీ బడ్జెట్‌తో ఒకే సినిమా అనుభవం ఉన్న సుజీత్‌తో 'సాహో' చిత్రం చేస్తున్నాడు. పక్కా స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మరోసారి దేశంలోని అన్నిభాషల్లో విడుదల చేసి, మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో తనది వన్‌ మూవీ వండర్‌ వ్యవహారం కాదని నిరూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌టు యంగ్‌రెబెల్‌స్టార్‌.

Darling Prabhas Completes 15 Years Cine Journey :

Darling Prabhas has completed 15 successful years in films

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement