Advertisement

విశాల్ కూడా పాలిటిక్స్ లోకి..?

Tue 07th Nov 2017 12:24 PM
vishal,interview,detective movie,politics  విశాల్ కూడా పాలిటిక్స్ లోకి..?
Vishal Talks About Political Entry విశాల్ కూడా పాలిటిక్స్ లోకి..?
Advertisement

విశాల్‌ హీరోగా, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియాలు నటించగా, మిస్కిన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'తుప్పరివారన్‌' చిత్రం తమిళంలో అక్టోబర్‌లో విడుదలై బాగా ఆడింది. ఈచిత్రం విశాల్‌కి మంచి పేరును, నిర్మాతగా లాభాలను తెచ్చింది. కాగా ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈనెల 10వ తేదీన 'డిటెక్టివ్‌' పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. మరి తమిళంతో పాటే తెలుగులో కూడా ఎందుకు ఒకేసారి విడుదల చేయలేదు.. అని విశాల్‌ని ప్రశ్నిస్తే.. ప్రస్తుతం తమిళ సెన్సార్‌ని ముంబైకి మార్చారు. నేటి రోజుల్లో సెన్సార్‌ సర్టిఫికేట్‌ తెచ్చుకోవడం అంటే డిగ్రీ సాధించినంత కష్టంగా ఉంది. ఇక ఇక్కడ రిలీజ్‌ చేయాల్సిన సమయంలో ఇక్కడ పెద్ద చిత్రాలు విడుదలవుతాయి. దాని వల్ల థియేటర్ల ప్రాబ్లమ్‌ వచ్చిందని చెప్పాడు. 'మెర్శల్‌' వివాదంపై మాట్లాడుతూ, సెన్సార్‌ సెంట్రల్‌ బోర్డు అంగీకరించిన తర్వాత రాజకీయపార్టీలు, లేదా ఎవరో ఒకరి ఇష్టానుసారం కట్‌ చేసుకుంటూ పోతే చివరికి సెన్సార్‌సర్టిఫికేట్‌ని తప్ప ప్రేక్షకులకు ఏమీ చూపించలేం అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

రాజకీయాలలోకి రావడంపై స్పందిస్తూ హీరోగా కెరీర్‌ బాగానే ఉంది. నిర్మాతగా కూడా డబ్బులు వస్తున్నాయి. ఎమ్మెల్యేల జీతం 2లక్షలు. ఆ డబ్బుతోనే నేను నా అవసరాలను తీర్చుకొని, ప్రజాసేవ చేయాలి. అధికారం ఉంటేనే ప్రజాసేవ చేయగలను అనిపించిన రోజున రాజకీయాల్లోకి వస్తానన్నాడు.ఇక ఈ వీకెండ్‌లో 'అదిరింది. గృహం, కేరాఫ్‌ సూర్యలతో పాటు డిటెక్టివ్‌ కూడా విడుదల కానుంది'. మరి ఈ చిత్రం ఈ పోటీలో ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి...! ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ బాగా నటించిందని, మరో గ్రేషేడ్స్‌ ఉన్న మరో లేడీ పాత్ర కూడా ఉంది. దానికి ఆండ్రియా అయితే బాగా సూటవుతుందని తీసుకున్నాం. ఆమె చాలా చక్కగా నటించిందని విశాల్‌ చెప్పుకొచ్చాడు. ఇక వివాదాల కోసమా అన్నట్లు ఆండ్రియా తాజాగా 'డిటెక్టివ్‌' విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌కి హైదరాబాద్‌కి వచ్చిన ఆమె 'ఆడాళ్లు ఎవరితో పక్కలో పడుకుంటారనేది వారి వ్యక్తిగత విషయమని, దీనిలో ఎవరి బలవంతం ఉండరాదని' సంచనల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Vishal Talks About Political Entry:

Vishal Interview About Detective Movie   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement