శ్రియా.. ఆ సీక్రెట్‌ ఏదో చెప్పొచ్చుగా!

Shriya Beauty Hot Topic in Social Media

Tue 31st Oct 2017 04:05 PM
shriya saran,hot photos shriya saran photoshoot,top heroine shriya  శ్రియా.. ఆ సీక్రెట్‌ ఏదో చెప్పొచ్చుగా!
Shriya Beauty Hot Topic in Social Media శ్రియా.. ఆ సీక్రెట్‌ ఏదో చెప్పొచ్చుగా!

విక్రమ్‌ కెకుమార్‌, ఆయన స్నేహితుడు కలసి రామోజీరావు నిర్మాతగా ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌లో వచ్చిన 'ఇష్టం' ద్వారా హీరోయిన్‌ శ్రియా శరణ్‌ టాలీవుడ్‌కి పరిచయమైంది. దానికి ఏడాది ముందే ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించింది. ఈ 17ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె సీనియర్‌స్టార్స్‌తో పాటు నేటి యంగ్‌స్టార్స్‌ అందరితోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ భామ వయసు ఆమె చెప్పేదాన్ని బట్టి చూస్తే 35. అనఫిషయల్‌గా అయితే మరో రెండేమూడేళ్లు కలపాల్సి వస్తుందని అంటారు. ఇక ఈమె ఇప్పటికీ తనదైన శైలిలో అవకాశాలు పొందుతూనే ఉంది. ఆమెతో సహా ఇండస్ట్రీకి వచ్చిన పలువురు హీరోయిన్లు కనుమరుగైపోయారు. ఇంకొందరు పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో గడుపుతున్నారు. మరికొందరు ఆంటీ పాత్రలతో, అమ్మల పాత్రల్లో రీఎంట్రీ ఇస్తున్నారు. మరి కొందరు సినిమాలకే గుడ్‌బై చెప్పేశారు. 

కానీ ఈమె ఏ ఎండకా గొడుగు లెక్కన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సీనియర్‌స్టార్స్‌, యంగ్‌స్టార్స్‌తో బాగా బిజీగా వెలిగిపోయింది. ఇప్పుడు కూడా ఐటం సాంగ్సే కాదు... సీనియర్‌స్టార్స్‌కి బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. వెంకటేష్‌ సరసన 'గోపాల గోపాల', బాలకృష్ణ సరసన 'గౌతమీపుత్ర శాతకర్ణి, పైసావసూల్‌'ఇలా కొనసాగుతూ ఏడాదికి రెండు మూడు చిత్రాలలోనైనా నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ప్రకాష్‌రాజ్‌ 'ఉలవచారు బిర్యానీ' రీమేక్‌ 'తడ్కా' లో నటిస్తోంది. ఇప్పటికీ ఈమె ఫిజిక్‌ చూస్తే ఎవరైనా ఆశ్యర్యపడిపోతారు. నాలుగైదేళ్లగా ఫేడవుట్‌ అయి, ఫిజిక్‌లో, గ్లామర్‌లో తేడాలు వచ్చి ఇబ్బందులు పడుతున్న హీరోయిన్లతో పోలిస్తే ఈమె ఫిట్నెస్‌ని చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 

ఇప్పటికీ 17ఏళ్ల కిందట ఉన్న ఫిజిక్‌నే ఆమె మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. అంతేకాదు.. హాట్‌హాట్‌ ఫొటో షూట్స్‌తో కూడా మతులు పోగొడుతోంది. ఒకవైపు సినిమాలు, మరో వైపు మేగజైన్లకు ఫొటో షూట్స్‌, ప్రైవేట్‌ ఫంక్షన్లు, ఈవెంట్స్‌, ఫ్యాషన్‌ వీక్స్‌,ఈవెంట్స్‌తో బిజీబిజీ. ఏడాదికి ఇప్పటికీ ఆమె నాలుగైదు కోట్లు వెనకేసుకుంటున్నదట. సినిమాలలో 35లక్షల నుంచి 50 వరకు డిమాండ్‌ చేస్తోంది. సీనియర్‌స్టార్స్‌తో చిత్రాలు చేసే దర్శకనిర్మాతలకు మరో ఆప్షన్‌ లేకపోవడం, ఆప్షన్స్‌ ఉన్నాకూడా ఈమెలా మ్యాజిక్‌ చేయలేకపోతుండటంతో ఈమె హవా అలా కొనసాగుతూనే ఉంది. ఈ లెక్కన ఆమెకి మరో ఐదేళ్లు ఢోకాలేదంటున్నారు. అందుకే ఆమె పెళ్లి, పిల్లలు అంటే మండిపడుతోంది. శ్రియమ్మా.. ఆ సీక్రెట్‌ కాస్త చెప్పమ్మా.. అని నేటి హీరోయిన్లు కూడా ఆమెని అడిగి నేర్చుకోవాల్సిందే...! 

Shriya Beauty Hot Topic in Social Media:

Shriya Hot Photos Hulchal in Social Media