Advertisement

దూలతీరిపోతోందా బాబూ....!

Sun 29th Oct 2017 08:31 PM
puri jagannath,mehbooba,himachal pradesh,akash puri  దూలతీరిపోతోందా బాబూ....!
Mehbooba... Doola Teeri Poinda? దూలతీరిపోతోందా బాబూ....!
Advertisement

పూరీజగన్నాథ్‌కి దర్శకునిగా ఓస్టైల్‌ ఉంది. ఎంతటి వైపరీత్యాలు సంభవించినా కూడా తనకున్న వనరులనే సద్వినియోగం చేసుకుంటూ వేగంగా, అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు తీయడం, షూటింగ్‌స్పాట్‌లోనే ఆన్‌లైన్‌ఎడిటింగ్‌ కూడా చేస్తుంటాడు. ఈ తరహా విధానం ఇటీవల వరకు బాగానే వర్కౌట్‌ అయింది. కానీ 'టెంపర్‌' తర్వాత 'జ్యోతిలక్ష్మి, లోఫర్‌, ఇజం, రోగ్‌'తో పాటు తాజాగా 'పైసావసూల్‌' కూడా డిజాస్టర్‌గానే నిలిచింది. ఇక పూరీ తన సోదరుడు సాయిరాం శంకర్‌ని హీరోగా నిలబెట్టలేకపోయాడు. కానీ తన కుమారుడు ఆకాష్‌పూరీని మాత్రం ఎలాగైనా హీరోగా నిలపాలని గట్టిగానే కృషి చేస్తూన్నాడు. హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌ స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రం కోసం పూరీ తన పాత మేకింగ్‌స్టైల్‌ని పక్కనపెట్టి కొత్తగా మేకింగ్‌ చేస్తున్నాడని, పూరీలో కనిపిస్తున్న మేకింగ్‌లో మార్పు చూసి యూనిట్‌ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారట. 

ఇక తన కుమారుడు ఆకాష్‌పూరీ, కొత్త బెంగుళూరు భామ నేహాశెట్టిలపై మొదటి షెడ్యూల్‌ని హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు కొండలపై తీస్తున్నాడు. 18వేల అడుగుల ఎత్తులో, మైనస్‌ 7 డిగ్రీల గడ్డకట్టే చలిలో మంచు కుండపోతగా కురుస్తుండగా ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. హిల్‌స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో దీనిని హిమాచల్‌లో చిత్రీకరిస్తున్నారు. అయినా అల్లుఅర్జున్‌ చిత్రం 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' కోసం ఇండియా సరిహద్దుల్లో కాశ్మీర్ వంటి మంచు కొండలో చిత్రీకరించాల్సిన షూటింగ్‌ను ఊటీలో జరుపుతున్నారు. 

పూరీ కూడా అదే విధంగా ఏ ఊటినో, కొడైకెనాల్‌నో ఉపయోగించు కోకుండా హిమాచల్‌ పర్వతాల వద్దకు వెళ్లి చలిలో వారు స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు, ఇతర చలిని తట్టుకునే దుస్తులు ధరించి పూరీతోసహా యూనిట్‌ అందరూ 'మెహబూబా, జై మెహబూబా' అంటూ ఆకాష్‌పూరి పోస్ట్‌ చేసినవీడియోలో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆన్‌లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నచార్మి కూడా అక్కడి ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టింది. ఇక జగన్‌కి చార్మికి ఎఫైర్‌ ఉందని నమ్మేవారు..కొడుకుకి ఎలాగూ హీరోయిన్‌ తోడుగా ఉంది. ఇక పూరీకి కూడా చార్మి తోడుగా ఉంటే చలి వారిని ఏం చేస్తుందిలే అని సెటైర్లు విసురుతున్నారు. 

Mehbooba... Doola Teeri Poinda?:

Puri's Mehbooba in Himachal Pradesh

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement