రిచా గంగోపాధ్యాయ్ షాకింగ్ డెసిషన్..!

Tue 24th Oct 2017 08:29 PM
richa gangopadhyay,mirchi,marapakay,movies,acting  రిచా గంగోపాధ్యాయ్ షాకింగ్ డెసిషన్..!
Richa Gangopadhyay Shocking Decision రిచా గంగోపాధ్యాయ్ షాకింగ్ డెసిషన్..!
Advertisement
Ads by CJ

రిచా గంగోపాధ్యాయ్..తనదైన నటనతో, గ్లామర్ తో దక్షిణాదిన ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించింది. 'లీడర్’ సినిమాతో 2010లో టాలీవుడ్ లో ప్రవేశించింది. అతి తక్కువ సమయంలో పెద్ద హీరోస్ తో నటించింది. ‘మిరపకాయ్’, ‘భాయ్’,‘మిర్చి’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ్ గత కొంతకాలంగా సినిమాలు చెయ్యడం లేదు.

సోషల్ మీడియాలో ఆ మధ్య తను గ్రాడ్యుయేట్ పూర్తి చేసానని పోస్ట్ చేసింది. చదువు పూర్తి చేసుకుని తిరిగి సినిమాలలో యాక్ట్ చేస్తుందేమో అనుకున్నారు. కాని ఆమె తన ట్విట్టర్ ద్వారా ఒక షాకింగ్ ట్విట్ చేసింది. ఇకపై తాను సినిమాలు చెయ్యబోనని, నటనకు గుడ్ బై చెప్పబోతునట్లు చెప్పింది. అంతేకాదు, కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు కూడా వెల్లడించింది. 

తన ట్విట్ ద్వారా తన అభిమానులనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులని కూడా నిరాశపరిచింది రిచా. బహుశా సినిమా అవకాశాలు రావట్లేదు అని ఈ నిర్ణయం తీసుకొందో లేదా నిజంగానే సినిమాలని నుండి తప్పుకుంటుందేమో ఆమెకే తెలియాలి.

Richa Gangopadhyay Shocking Decision:

Richa Gangopadhyay Good Bye to Acting

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ