Advertisementt

క్రెడిట్ మొత్తం నాగ్.. కోడలికే ఇచ్చేశాడు!

Fri 20th Oct 2017 05:55 AM
samantha,nagarjuna,raju gari gadhi 2,amrutha role  క్రెడిట్ మొత్తం నాగ్.. కోడలికే ఇచ్చేశాడు!
Nagarjuna About Raju Gari Gadhi 2 Samantha Role క్రెడిట్ మొత్తం నాగ్.. కోడలికే ఇచ్చేశాడు!
Advertisement
Ads by CJ

నిజానికి హర్రర్‌ కామెడీ చిత్రాలలో చిన్న నటులు హీరోలు తప్పితే స్టార్స్‌ నటించి చాలా కాలమే అయింది. కానీ తెలుగులో 'రాజుగారిగది'కి పార్ట్‌2గా వచ్చిన 'రాజుగారిగది 2'లో నాగార్జున, ఆయన కోడలు సమంతలు నటించడంతో స్టార్‌ అట్రాక్షన్‌ వచ్చేసింది. అయితే ఈచిత్రానికి ప్రేక్షకుల్లో డిఫరెంట్‌ టాక్‌ వస్తోంది. మొదటి భాగం విజయవంతం కావడంతో కీలకపాత్ర పోషించి కామెడీని నిర్లక్ష్యం చేశారని, సెకండ్‌పార్ట్‌లో దానిని బ్యాక్‌సీటులోకి పంపారని, ఇక హర్రర్‌ సీన్స్‌ కూడా పెద్దగా భయపెట్టేలా లేవని, కేవలం ఎమోషన్స్‌ పండించి హిట్‌ చేయాలని చూశారని విమర్శలు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈచిత్రం కలెక్షన్లు సోమ, మంగళ వారాల తర్వాత బాగా డ్రాప్‌ అయ్యాయట. 

మరోవైపు ఈచిత్రం ఓవర్‌సీస్‌లో మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. కానీ నాగార్జున తన కొత్త కోడలు సమంతతో కలిసి ఇప్పటివరకు తన చిత్రాలకు చేయని విధంగా గట్టి ప్రమోషన్స్‌ చేస్తుండటం విశేషం. కనీసం తన కొత్త జంట అయిన చైతూ-సామ్‌లు కలిసి హ్యాపీగా గడపక ముందే సమంత ఈ ప్రమోషన్స్‌లో ముందుకొచ్చింది. ఇక ఈచిత్రం విషయంలో నాగార్జున తన అక్కినేని వారికోడలు సమంతకు మరింత ప్రమోట్‌ చేస్తున్నాడు. ఈచిత్రంలో సమంత కనిపించేది కొద్ది సేపే అయినా ఆమె క్రెడిట్‌ అంతా కొట్టేసిందని, అమృత పాత్రలో ఆమె అదరగొట్టిందని అంటున్నాడు. ఈ చిత్రంలో నటించిన వారందరూ చిన్నపెద్ద పాత్రలే అన్న తేడా లేకుండా అందరూ బాగా చేశారని, రావు రమేష్‌ కనిపించింది కొద్దిసేపే అయినా బాగా చేశాడని తెలిపాడు. ఇక ఈచిత్రం కేవలం హర్రర్‌ చిత్రం అయితే తాను చేసేవాడిని కాదని, ఎమోషనల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాబట్టే నటించాను. 

ఇలాంటి చిత్రాలు బాగా ఆడితే ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించడానికి మరికొందరు ముందుకొస్తారని తెలిపాడు. ఇక తాజాగా ఈచిత్రాన్ని మహిళల కోసం స్పెషల్‌ షోవేశారు. షోచూసిన మహిళలందరూ అక్కినేని ఫ్యామీలీ గ్రేట్‌ అని పొగిడితే హీరోయిన్‌ పూనమ్‌కౌర్‌ మాత్రం నాగ్‌ని తన కౌగిట్లో బంధించేసి, గట్టి హగ్‌ ఇచ్చి నాగ్‌ సైతం ఆశ్యర్యపోయి, ఉలిక్కిపడేలా చేసింది. మరోవైపు ఈ చిత్రంలో గ్లామర్‌ని బాగానే చూపిన సీరత్‌కపూర్‌ ద్వారా ఈ చిత్రాన్ని మరోవర్గం ప్రేక్షకులకు దగ్గరచేయాలని భావించిన యూనిట్‌ సీరత్‌ చేతుల మీదుగా తన సెక్సీఫొటోని విడుదల చేయించారు. మరి ఇదైనా ఈచిత్రానికి ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సివుంది...! 

Nagarjuna About Raju Gari Gadhi 2 Samantha Role:

Nagarjuna Praises Raju Gari Gadhi 2 Amrutha Role

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ