రామ్ చరణ్ చిన్న పిల్లాడు: అనసూయ!

Anasuya About Ram Charan DedicationAnasuya About Ram Charan Dedication

యాంకర్ అనసూయ అటు బుల్లితెర షోస్ తో పాటు ఇటు వెండితెర సినిమాలతోను తన హవాని చూపిస్తుంది. జబర్దస్త్ షోతో పాటే పలు షోలు చేస్తున్న అనసూయ ప్రస్తుతానికి రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'రంగస్థలం 1985' లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని..... చిత్ర బృందం చెబుతుంది. అయితే రంగస్థలంలో నటిస్తున్న అనసూయ, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ సెట్స్ లో చరణ్ ఎలా ఉంటాడో.. అలాగే చరణ్ ప్రవర్తన గురించి తెగ పొగిడేస్తుంది.

రామ్ చరణ్ ఏ విషయాన్ని నేర్చుకోవడానికయినా చిన్న పిల్లాడిలా చాలా ఆసక్తి చూపిస్తారని...... అలాగే షూటింగ్ సమయంలో కూడా చిన్నపిల్లాడిలా అందరిని ఆటపట్టిచ్చేవాడని... ఇంకా చరణ్  తన ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకుంటాడని చెప్పుకొచ్చింది అనసూయ. మరి కో-స్టార్ రామ్ చరణ్ ని అనసూయ అంతలా పొగిడేసి బాగానే బిస్కెట్స్ వేస్తుందంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రంగస్థలంలో ఇప్పటికే అనసూయకి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయిందట. ఆ షెడ్యూల్ పూర్తికావడంతో ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను అని కూడా చెబుతుంది అనసూయ.

Anasuya Praises Ram charan

anasuya
ram charan
rangasthalam 1985
praises