Advertisement

పరుచూరి పవన్ ని మామూలుగా పొగడలా..!

Sun 15th Oct 2017 12:26 PM
paruchuri gopala krishna,pawan kalyan,attarintiki daaredi  పరుచూరి పవన్ ని మామూలుగా పొగడలా..!
Paruchuri Gopala Krishna Preises Pawan Kalyan పరుచూరి పవన్ ని మామూలుగా పొగడలా..!
Advertisement

సోషల్‌మీడియాలో వస్తున్న రివ్యూలు బాగాలేవని వచ్చినప్పుడు, వారి గురించిన నెగటివ్‌ న్యూస్‌లు వచ్చినప్పుడు మన సినిమా జనాలు సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రాసేస్తూ... ఏమేమో చెప్పేస్తూ మేధావులలాగా ఫీలవుతున్నారని సోషల్‌ మీడియాను చెడుగా చెబుతున్నారు. కానీ అందరికంటే సోషల్‌ మీడియాను ఎక్కువగా తమ కోసం వాడుకుని వార్తల్లో నిలుస్తోంది వారేనని మర్చిపోతున్నారు. బికినీలు, హాట్‌ఫోటోలు, వీడియాలతో వారే పరమ చెత్తను సోషల్‌మీడియాలో పెడుతున్నారు. నెటిజన్లు యాంటీగా స్పందిస్తే మాత్రం తిట్టిపోస్తున్నారు. 

ఇక ఇప్పుడు సోషల్‌మీడియా అనేది ఫేడవుట్‌ అయిన వారికి కూడా బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటికే తమ్మారెడ్డి భరద్వాజ ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని తన అభిప్రాయాలను సోషల్‌మీడియోతో  పంచుకుంటున్నాడు. ఇక తనికెళ్లభరణి నుంచి ఒకప్పటి అగ్ర రచయితగా పేరు తెచ్చుకున్న పరుచూరిబ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ సైతం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో 'పరుచూరి పాఠాలు' అని చెప్పి వీడియోలను పెడుతున్నాడు. ఇటీవలే మహేష్‌ని ఆకాశానికి ఎత్తేసి ఆయనను ఛత్రపతి శివాజీగా నటించాలని ఆయన అభిమానులు డిమాండ్‌ చేయాలని సెలవిచ్చాడు. ఇప్పుడు పవన్‌ భజన మొదలుపెట్టాడు. మొత్తానికి భజన చేయడంలో పరుచూరి వారి తర్వాతే ఎవరైనా అనిచెప్పాలి. 

ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ, 'చెట్టుకు విత్తనం లాగా, కథకు ఒక ఆలోచన వస్తే దానిని 'కధాంశం'గా ఎలా డెవలప్‌మెంట్‌ చేస్తారనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు'. ఇక ఆయన తన మాటల్లో తాజాగా వచ్చిన'ఫిదా' చిత్రంతో పాటు మూడేళ్ల కిందట విడుదలైన పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ల 'అత్తారింటికి దారేది' విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాడు. 'అత్తారింటికి దారేది' చిత్రం క్లైమాక్స్‌లో పవన్‌ నటించిన తీరు అద్భుతం. హ్యేట్సాఫ్‌టు పవన్‌కళ్యాణ్‌. ఎందుకంటే అంత మాస్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్‌ కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తను బతిమాడాల్సిన అవసరం లేదని చెప్పాడు. మొత్తానికి ఇలాంటి సీనియర్లు సోషల్‌మీడియా ద్వారా తమ అనుభవాలను పంచుకుంటే అవి యువతరం దర్శకరచయితలకు, నటీనటులకు కూడా ఓ పాఠంగా ఉంటుంది.

Paruchuri Gopala Krishna Preises Pawan Kalyan:

Paruchuri about Attarintiki Daaredi Story Line

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement