'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర నిర్మాత పేరుతో మరో రచ్చ!

RGV Announced Lakshmi's NTR Producer RGV Announced Lakshmi's NTR Producer

రామ్ గోపాల్ వర్మ రచ్చ మాములుగా లేదు. సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతిని హైలెట్ చేస్తూ... ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత జరిగిన ఘటనలను కళ్ళకు కట్టినట్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపిస్తానంటూ బయలు దేరాడు. కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తానని ప్రకటించడమే కాదు... ఆ సినిమాకి సంబందించి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసి హడావిడి చెయ్యడమే కాదు.... ఈ సినిమాని నిర్మించే నిర్మాత ఎవరో కూడా రివీల్ చేసేశాడు. ఇంతకుముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వర్మగారి శిష్యుడు జెడి చక్రవర్తి నిర్మిస్తాడని వార్తలొచ్చినప్పటికీ వర్మ ఆ వార్తలని కొట్టిపారేశాడు.

మళ్ళీ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నిర్మించబోయేది వైసిపి ఎమ్యెల్యే పి.రాకేష్ రెడ్డి అని ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేశాడు. నా దర్శకత్వంలో తెరకెక్కబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వైసిపి నేత పి రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నాడని... రాకేష్ రెడ్డి కూడా నా అభిమతానికి అతీతంగానే ఉన్నాడని.. మేమిద్దరం కలిసి రాజకీయాలకు అతీతంగా ఈ సినిమాని నిజాలతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న రాకేష్ రెడ్డి ని రామ్ గోపాల్ వర్మ... లక్ష్మీస్ ఎన్టీఆర్ కి నిర్మాతగా చేయడం చూస్తుంటే  ఈ సినిమా కచ్చితంగా టిడిపికి వ్యతిరేకంగా... లక్ష్మి పార్వతికి అనుకూలంగా వుంటుందనే చర్చలు స్టార్ట్ అయ్యాయి.

ఇప్పటికే టిడిపి నేతలు దర్శకుడు వర్మ మీద ఒంటికాలితో లేస్తున్నారు. ఎన్టీఆర్ పై ఎలాంటి సినిమా తియ్యాలన్నా మా నాయకుడు చంద్రబాబు అనుమతి కావాలని... లేకుంటే ఆ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఎలా విడుదల చేస్తావో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయితే వర్మ ఎవ్వరికి భయపడే రకం కాదాయే..... మరోపక్క లక్ష్మి పార్వతి లక్ష్మీస్ ఎన్టీఆర్ తియ్యడానికి కేవలం నా అనుమతి మాత్రమే సరిపోతుందంటూ స్టేట్మెంట్స్ చూస్తుంటే మాత్రం పచ్చ పార్టీకి వ్యతిరేకంగానే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉండబోతుందనేది అర్ధమవుతోంది. ఇక ఇప్పుడు వైసిపి నేత నిర్మాతగా మారడం చూస్తుంటే అదే అనుమానాలు బలపడడమే కాదు పూర్తి క్లారిటీ వచ్చేసింది అంటున్నారు.

Lakshmi's NTR Movie Produced by YSRCP Leader

lakshmis ntr
ram gopal varma
ysrcp
rakesh reddy
tdp leaders