వాళ్ళెంతమంది వున్నా.. ప్రభాస్ ఒక్కడుచాలు!

Tue 03rd Oct 2017 04:51 PM
prabhas,saaho,naseeruddin shah in prabhas saaho,other language artists  వాళ్ళెంతమంది వున్నా.. ప్రభాస్ ఒక్కడుచాలు!
Naseeruddin Shah in Prabhas Saaho వాళ్ళెంతమంది వున్నా.. ప్రభాస్ ఒక్కడుచాలు!
Sponsored links

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కి 'బాహుబలి' తర్వాత హీరోగా విపరీతమైన క్రేజ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన ఇండియన్‌ నేషనల్‌స్టార్‌గా ఎదిగాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో' చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా తీస్తున్నందున అన్ని భాషల నటీనటులను ఆ సినిమా కోసం ఎంపిక చేస్తున్నారు. నీల్‌నితిన్‌ముఖేష్‌, జాకీష్రాఫ్‌, చుంకీపాండేలతో పాటు మెయిన్‌ విలన్‌ పాత్రకి నసీరుద్దీషాను ఎంపిక చేశారు. కటౌట్‌కి ప్రభాస్‌కి పోటీ ఇవ్వలేకపోయినా నటనలో మాత్రం ఏ స్టార్‌నైనా డామినేట్‌ చేయగలిగిన విలక్షణ నటుడు నసీరుద్దీన్‌ షా. 

ఈ విషయంలో యూనిట్‌ సరైన ప్రతినాయకుడిని వెతికి పట్టుకుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడే ఒక సమస్య ఎదురవుతోంది. ఈ చిత్రం నిండా పరభాషా నటులను పెడుతూ ఉండటంతో చివరకు తెలుగు ప్రేక్షకులకు ఈచిత్రం లోటు తెచ్చినట్లు అవుతుందా? ఈ ఇతర భాషల నటీనటుల ఫ్లేవర్స్‌ వల్ల 'సాహో' చిత్రానికి తెలుగు కంటే ఇతర భాషల్లోనే ఎక్కువగాక్రేజ్‌ వచ్చినా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు అని విశ్లేషకులు అంటున్నారు. అయినా తెలుగువారికి ప్రభాస్‌ ఒక్కడు ఉంటే అదే చాలని మరికొందరు వాదిస్తున్నారు. 

Sponsored links

Naseeruddin Shah in Prabhas Saaho:

Parabhas Saaho Artists Details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019