Advertisementt

తల్లి కాబోతున్నానని కన్‌ఫర్మ్‌ చేసింది..!

Wed 20th Sep 2017 02:45 PM
kajal,sister nisha agarwal,pregnency nisha agrwal  తల్లి కాబోతున్నానని కన్‌ఫర్మ్‌ చేసింది..!
Kajal Agarwal’s Sister Turning Mother! తల్లి కాబోతున్నానని కన్‌ఫర్మ్‌ చేసింది..!
Advertisement
Ads by CJ

నాటితరం నుంచి మొన్నటి, నేటితరం దాకా మనం వారసులని చూస్తూనే ఉన్నాం. వారు తమ అనుభవంతో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు అండగా ఉంటారు.ఇక వారి ఫ్యాన్స్‌ కూడా ఓ హీరో స్టార్‌ హీరో కుమారుడో లేక సోదరుడో అయితే వారి హీరోపై ఎంతటి అభిమానాన్ని చూపిస్తారో.. వారి కుమారులు, సోదరులపై కూడా అదే ఆదరణ చూపిస్తారు. ఇదే వారసత్వం హీరోయిన్ల విషయంలో పెద్దగా వర్కౌట్‌ కావట్లేదు. 

తమ సోదరీ మణులు, తమ కుమార్తెలు పెద్దగా రాణించలేకపోతున్నారు. మొన్నటి తరం రాధిక-నిరోషా నుంచి నగ్మా, ఆర్తి అగర్వాల్‌,శృతిహాసన్‌, కాజల్‌ అగర్వాల్‌ సోదరీ మణులు తమ అక్కల పలుకుబడితో చాన్స్‌లు దక్కించుకున్నా నగ్మా,జ్యోతిక లాగా స్టార్‌ హీరోయిన్స్‌ కావడం లేదు. ఇక నాటి నటి రాధ కుమార్తెలు ఇద్దరు కూడా తట్టాబట్టులు సర్దుకున్నారు. ఇక త్వరలో శ్రీదేవి కూతుర్ల విషయంలో ఏమి జరుగుతుందో వేచిచూడాల్సివుంది....! ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌ చందమామ తన కెరీర్‌ మొదలుపెట్టి పదేళ్లు దాటింది. 

50 చిత్రాలలో నటించింది. ప్రతిసారి ఫేడవుట్‌ అయ్యే స్థితికి రావడం, మరలా పుంజుకోవడం ఈ చందమామకు అలవాటైపోయింది. ఇక ఈమె చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా 'ఏమైంది ఈవేళ, సోలో' చిత్రాలలో నటించినా ఫలితం దక్కలేదు. ప్రేక్షకులు ఆదరించలేదు. దాంతో ఆమె తన అక్క కాజల్‌ కన్నా ముందుగానే 2013లో ముంబైకి చెందిన కరణ్‌ని వివాహం చేసుకుంది. ఈమె త్వరలో తల్లి కాబోతోందంటూ వార్తలు వస్తే వాటిని వారు కొట్టిపడేశారు.

కానీ తాజాగా ఈ అమ్మడు త్వరలో తల్లి కాబోతున్నానని, తమ మద్యకు మరో ప్రాణి వస్తోందని కన్‌ఫర్మ్‌ చేసింది.అంటే త్వరలో కాజల్‌ పెద్దమ్మ కాబోతోంది. మరి పిల్లలంటే ఎంతో ఇష్టమైన కాజల్‌ తన చెల్లికే బిడ్డ పుట్టనుండటంతో ఆమె పెళ్లి చేసుకుని పిల్లలను కనేలోగా తన సోదరి బిడ్డను అల్లారుముద్దు చేయనుండటం విశేషం. 

Kajal Agarwal’s Sister Turning Mother!:

Nisha Agarwal confirmed the news that she is going to soon turn mother.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ