Advertisement

'జై లవ కుశ' కి ఆ 20 నిమిషాలు చాలు..!

Fri 15th Sep 2017 06:52 PM
jai lava kusa,jr ntr,young tiger ntr,highlights,jai lava kusa censor talk,climax highlight in jlk  'జై లవ కుశ' కి ఆ 20 నిమిషాలు చాలు..!
Jai Lava Kusa Censor Talk Revealed 'జై లవ కుశ' కి ఆ 20 నిమిషాలు చాలు..!
Advertisement

ఎన్టీఆర్ 'జై లవ కుశ' తో అదరగొట్టడానికి అతి త్వరలోనే అంటే మరో ఆరు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కించాడు. అయితే 'జై లవ కుశ'లో రామాయణం లో లంకా పట్టణం ఉన్నట్టే... 'జై లవ కుశ' లో కూడా ఒక ఊరు రావణుడిగా చెప్పబడుతున్న జై గ్రిప్ లో ఉంటుందట. ఆ పట్టణానికి లవ, కుశలు వెళ్లి తమ పనులను చక్కబెట్టుకుని రావాలి అంట. ఈ సన్నివేశాలే 'జై లవ కుశ'కు కీలకం అంటున్నారు.

జై కోపంగా ఉంటే లవ, కుశలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారట. ఇక 'జై లవ కుశ' చివరి 20 , 25 నిమిషాల్లోనే ఎన్టీఆర్ నటన పీక్ లో ఉంటుందట. ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ ఆ 20 నిమిషాల్లోనే ఉంటుందని అంటున్నారు. 'జై లవ కుశ' లో ఆ 20 నిమిషాల పెరఫార్మెన్సు చేసినట్టు మళ్ళీ ఎన్టీఆర్ కి అలాంటి మరొక అవకాశం ఇక రాకపోవచ్చనే టాక్ వినబడుతుంది. మరి చివరి 20 నిమిషాల్లో అంతటి నటన ఎన్టీఆర్ కనబరుస్తాడు అంటే 'జై లవ కుశ' క్లైమాక్స్ విషాదాంతం కాబోతుందా? అనే అనుమానం వచ్చేస్తుంది.

మరి ఇప్పటివరకు అందరూ ఊహించిందే 'జై లవ కుశ'లో జరగబోతుందా? క్లైమాక్స్ లో జై పాత్రని ముగించేస్తారా? అనిపిస్తుంది సెన్సార్ టాక్ చూస్తుంటే. మరి మూడు పాత్రలు ఉంటే చివరిలో ఒక పాత్రను అలా ఎండ్ చెయ్యడం అనేది కామన్ అయినట్టే... 'జై లవ కుశ' ని కూడా అలానే చేస్తున్నారనిపిస్తుంది. ఇక 'జై లవ కుశ' ని చూడడానికి ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం పిచ్చెక్కిపోయి ఎదురుచూస్తున్నారు.

Jai Lava Kusa Censor Talk Revealed:

Young Tiger NTR Jai Lava Kusa Movie Highlights 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement