Advertisement

తెలంగాణ కి సమంత, మరి ఏపీ కి..!

Tue 12th Sep 2017 10:55 PM
poonam kaur,handlooms,brand ambassador,andhra pradesh,samantha  తెలంగాణ కి సమంత, మరి ఏపీ కి..!
Poonam Kaur is brand ambassador for handlooms? తెలంగాణ కి సమంత, మరి ఏపీ కి..!
Advertisement

తెలంగాణ ప్రభుత్వం చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించడం  కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ ని చేసింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి తెలంగాణ చేనేత వస్త్రాలకు తనదైన రీతిలో ప్రచారం మొదలుపెట్టింది సమంత. మరి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయితే చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా తగిన న్యాయం చేయగలదా? అసలామె ఏ విధంగా ఈ చేనేత వస్త్రాలకు ప్రచారం చేస్తుంది.

అలాగే హాట్ గా వుండే ఈ భామ ఇలాంటి చేనేత వస్త్రాలను అసలు కట్టుకుని మిగతా వాళ్లకు ఏం మెస్సేజ్ ఇస్తుంది... అని అనుకున్న వాళ్లకు చెంప పెట్టుగా సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మెప్పు, మన్నలు పొందుతుంది. సమంత ఇండస్ట్రీలో జరిగే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి ఈ చేనేత చీరలనే తనదయిన స్టయిల్ లో ధరించి అందరికి చేనేత వస్త్రాలపైన ఉన్న చిన్న చూపుని తొలగిస్తూ ప్రచారం చేస్తుంది. అంతేనా ఈ చేనేత చీరతోనే సమంత రాంప్ పై హొయలు పోతూ వాక్ కూడా చేసింది. అంతే కాకుండా చేనేత వస్త్రాలను తయారుచేసే వారి దగ్గరకు వెళ్లి వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకుంటూ ఆమెకు అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా చేసుకుపోతుంది. 

అయితే ఇప్పుడు ఇదే తరహాలో ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా నటి పూనమ్ కౌర్ ని చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రకటించాడు. మరి పూనమ్ కౌర్ కి ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. ఆమె చంద్రబాబు నాయుడు అప్పగించిన పనిని ఇక్కడ సమంత లాగా  చెయ్యగలదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. సమంతలాగా చేనేత వస్త్రాలను ధరించి... ఆమెలాగే ఇంతటి ప్రచారాన్ని కల్పించగలదా అనే దానికి పూనమ్ కౌర్ కూడా ఆన్సర్ కింద ఏదన్నా ఒక చేనేత బ్రాండ్ ధరించి అందరికి దర్శనమిస్తే... ఆమె మీద వచ్చే అనుమానాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. మరి సమంతకి పోటీగా దింపిన పూనమ్ ఏమాత్రం చేనేత వస్త్రాలకు ఉపయోగపడుతుందో చూద్దాం!!

Poonam Kaur is brand ambassador for handlooms?:

Telangana Government has appointed Leading Heroine, Samantha as the brand ambassador for handlooms in Telangana and Now Poonam Kaur will be doing the same for Andhra Pradesh state.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement