Advertisement

'అర్జున్‌రెడ్డి' నిజంగా మంచి చిత్రమా..?

Sun 10th Sep 2017 01:25 AM
arjun reddy,sankarabharanam,tagore,bharatiyudu,shiva,arjun reddy good and bad  'అర్జున్‌రెడ్డి' నిజంగా మంచి చిత్రమా..?
Analysis On Arjun Reddy Movie 'అర్జున్‌రెడ్డి' నిజంగా మంచి చిత్రమా..?
Advertisement

ఎవరెన్ని చెప్పినా 'అర్జున్‌రెడ్డి' సినిమా తెలుగులో ఓ ట్రెండ్‌సెట్టర్‌. సినిమా రూల్స్‌ని బ్రేక్‌చేసి, సినిమాని, అందులోని పాత్రలను ఇలాగా కూడా చూపించవచ్చు.. అని కొత్తకోణంలో సినిమాని ఆవిష్కరింపజేసిన చిత్రం 'అర్జున్‌రెడ్డి'. సినిమా రూల్స్‌ని బ్రేక్‌చేస్తూ, కమర్షియల్‌ సినిమా అంటే ఐదారు పాటలు, ఓ ఐటంసాంగ్‌, ఐదారు ఫైట్లు ఉండాలని గిరి గీసుకున్న సినిమా మేకర్స్‌ని ఈ విధంగా కూడా సినిమాని చూపించవచ్చు. హీరో అనే వాడు ఇలాగా కూడా ఉండవచ్చు.. అని కొత్త భాష్యాన్ని లిఖించిన చిత్రం ఇది. 

గత వారం రోజులుగా ఈ చిత్రం వార్తల్లో నానుతూనే ఉంది. వివాదాలు, విమర్శలు, పొగడ్తలు, కలెక్షన్ల వర్షం, వాదోపవాదనలు, మొత్తంగా తెలుగు సినీ ప్రేక్షకులు రెండుగా విడిపోయారు. అదే 'అర్జున్‌రెడ్డి' అనుకూల వర్గం, 'అర్జున్‌రెడ్డి' ప్రతికూల వర్గం. కానీ సినిమా మంచి చెడుల గురించి వాదన వచ్చినప్పుడల్లా మన సినిమా పెద్దలు రెండు సినిమాలను ఉదాహరణగా చూపి వితండవాదం చేస్తూ ఉంటారు. సినిమా చూసి ప్రేక్షకులు చెడిపోవడం, బాగుపడటటం ఉండదని, అలాగైతే 'శివ' చూసి సైకిల్‌ చైన్‌లు పట్టుకున్న వారు 'శంకరాభరణం' చూసి సంగీతం వైపు మక్కువ చూపారా? 'సాగర సంగమం' చూసి నాట్యం నేర్చుకున్నారా? అని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ చెడు చూపినంత తొందరగా ఇంపాక్ట్‌ అనేది మంచి చూపదు. అది ప్రజలలో మార్పును తెచ్చినా దాని ఫలితం కనిపించడానికి చాలా కాలం పడుతుంది. సినిమాను చూసి చెడిపోయే వారు, బాగుపడే వారు లేరనే అనుకుందాం. కానీ చెడు వ్యాపించినంత వైరల్‌గా మంచి వ్యాపించదు. కానీ చెడు మాత్రం వెంటనే ఇంపాక్ట్‌ చూపిస్తుంది. 

'అర్జున్‌రెడ్డి'లో చాలామందిలో కనిపించే కోపం, ప్రేమ, విశృంఖలత్వం, భావోద్వేగాలు, కోరికలు.. ఇలా అన్ని సహజంగా ఉన్నాయి. సినిమా రూల్స్‌ని ఈ సినిమా బ్రేక్‌ చేసి ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకుని ఉండవచ్చు. కలెక్షన్ల పరంగా ఈచిత్రం కేవలం నాలుగుకోట్లతో నిర్మిస్తే 40కోట్లు వసూలు చేసి ఉండవచ్చు. కాబట్టి ఈ 'అర్జున్‌రెడ్డి'ని మనం చరిత్రను మార్చిన చిత్రంగా, రూల్స్‌ని బ్రేక్‌ చేసిన సినిమాగా భావించడంలో అభ్యంతరం లేదు. కానీ 'ఠాగూర్‌, భారతీయుడు' వంటి చిత్రాలు చూసి అవినీతి చేయడం మనం మానుకున్నామా? అనే ప్రశ్న రావచ్చు. అంత మాత్రాన అర్జున్‌రెడ్డిని సెన్సేషనల్‌ హిట్‌గా చెప్పవచ్చేమోగానీ మంచి చిత్రంగా మాత్రం చెప్పలేం. 

'బిజినెస్‌మేన్‌'లో మహేష్‌బాబు వ్యక్తిత్వాన్ని చూసి దానినే ఆదర్శంగా తీసుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇక 'అర్జున్‌రెడ్డి'లో మంచిని చూపించినా కూడా దానిలోని బ్యాడ్‌ మాత్రమే ప్రేక్షకుల్లో దర్శకుడు చెప్పినట్లుగా ఓ డ్రగ్‌గా అది నిబిఢీకృతమైపోయింది. దాని వల్లన ఇప్పుడే ఫలితం కనిపించకపోవచ్చు. కానీ ఇప్పటికే 'అర్జున్‌రెడ్డి' స్టైల్‌ని ఫాలో అవుతున్నవారు, ఆయన జీవితాన్ని ఫాలో అవుతూ, తమ బైక్‌లపై కూడా 'ఐ యామ్‌ అర్జున్‌రెడ్డి' అని లోగోలను అంటించుకుని తిరుగుతున్న వారు ఎందరో కనిపిస్తున్నారు. 

కాబట్టి చెడు సెకన్‌లో ప్రయాణించే వేగం, మంచి నాలుగైదు నెలలు ప్రయాణించిన దూరంతో సమానంగా ఉంటుంది అనేది జీవిత సత్యం. నాటి గాంధీ నుంచి నేటి తరం మేధావుల వరకు అదే మాట చెబుతారు. ఎన్నో సంవత్సరాలకు గానీ మరో వివేకానందుడు పుట్టడు. కానీ బిన్‌లాడెన్‌లు, అబూ సలేం, దావూద్‌ ఇబ్రహీంలు ప్రతి ఏడాది పుడుతూనే ఉంటారు. 

Analysis On Arjun Reddy Movie :

What is Good and What is Bad in Arjun Reddy?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement