Advertisement

పవన్ దసరా గిఫ్ట్ ఏంటో తెలుసా..?

Thu 07th Sep 2017 06:52 PM
pawan kalyan,pawan kalyan fans,pspk25 film title,agnathavaasi,trivikram srinivas  పవన్ దసరా గిఫ్ట్ ఏంటో తెలుసా..?
PSPK25: Title to be revealed on Dussehra పవన్ దసరా గిఫ్ట్ ఏంటో తెలుసా..?
Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న పవన్ 25  వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కాన్సెప్ట్ లుక్, అనిరుధ్ గాత్రంతో ఆలపించిన పాట అందరిని బాగానే ఆకట్టుకున్నాయి. పవన్ పుట్టినరోజున పవన్ ఫాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ లు ఇచ్చినా, పవన్ సినిమా టైటిల్ మాత్రం ఇంకా చెప్పకుండా సస్పెన్సు లో పెట్టారు. అయితే కాన్సెప్ట్ పోస్టర్ ని, పాటని విన్న తర్వాత పవన్ ఫాన్స్ తో పాటే అందరూ పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం టైటిల్ 'అజ్ఞాతవాసి'గా దాదాపు ఫిక్స్ అయ్యారు. కానీ పవన్ పుట్టినరోజు సాయంత్రానికల్లా పవన్ - హీరోయిన్ కీర్తీలు కలిసున్న రొమాంటిక్ అండ్ కూల్ లుక్ ని విడుదల చేశారు. ఆ లుక్ చూశాక ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ఏం బావుంటుందనే అనుమానంలో ఉన్నారు కొందరు.

అయితే ఈ కన్ఫ్యూజన్ ని మాత్రం పవన్ కళ్యాణ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడట. పవన్ - త్రివిక్రమ్ సినిమా మొదట ఈ దసరాకే విడుదలవుతుందనుకున్నారు అంతా. కానీ త్రివిక్రమ్ - పవన్ తాత్సారం వల్ల ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10 కి వెళ్ళిపోయింది. అందుకే ఈ దసరాకి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని హార్ట్ కానివ్వకుండా తన 25 వ సినిమా టైటిల్ ని స్వయంగా ప్రకటిస్తాడనే టాక్ బయటికి వచ్చింది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది పవన్ దసరాకి రివీల్ చేయనున్నాడనే న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది. చూద్దాం మరి ఆ టైటిల్ ఏమిటనేది.

PSPK25: Title to be revealed on Dussehra:

There are high chances of the PSPK25 actual title being revealed this Dussehra.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement