Advertisement

రామ్ చరణ్ విలన్ కాదు మహేష్ విలన్..!

Thu 07th Sep 2017 05:16 PM
bogan,aravind swamy,sj surya,bogan telugu remake,raviteja,director lakshman  రామ్ చరణ్ విలన్ కాదు మహేష్ విలన్..!
Director Lakshman About Bogan Telugu Version Villain రామ్ చరణ్ విలన్ కాదు మహేష్ విలన్..!
Advertisement

చాలాకాలం తర్వాత తెలుగులోకి రామ్‌చరణ్‌ నటించిన 'ధృవ' చిత్రంతో విలన్‌గా అరవింద్‌స్వామి రీఎంట్రీ ఇచ్చాడు. 'దళపతి, రోజా, ముంబాయి' వంటి చిత్రాలలో నటించిన అరవింద్‌స్వామి, తమిళంలో రూపొందిన 'ధృవ' ఒరిజినల్‌ వెర్షన్‌ 'తని ఒరువన్‌' లో కూడా విలన్‌గా చేసి అద్భుతమైన పేరును తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తర్వాత మరలా జయం రవి హీరోగా, అరవింద్‌స్వామి విలన్‌గా నటించిన 'బోగన్‌' చిత్రం కూడా బాగా ఆడింది. ఈ చిత్రంలో కూడా అరవింద్‌స్వామి విలన్‌గా మరోసారి అద్భుతంగా నటించాడు. 

కాగా ప్రస్తుతం 'బోగన్‌' చిత్రం తెలుగులోకి రీమేక్‌ కానుంది. ఇందులో హీరోగా రవితేజ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విలన్‌గా తమిళంలో అద్భుతంగా నటించిన అరవింద్‌స్వామినే తెలుగులో కూడా విలన్‌గా నటించమని కోరారట. కానీ దీనికి ఆయన నో చెప్పాడని సమాచారం. కాగా తమిళంలో ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటించగా, లక్ష్మణ్‌ దర్శకత్వం వహించాడు. తెలుగు వెర్షన్‌కి కూడా లక్ష్మణే దర్శకత్వం వహించనున్నాడు.

తాజాగా ఈ చిత్రం దర్శకుడు మాట్లాడుతూ, తాము అరవింద్‌స్వామిని అసలు సంప్రదించలేదని అంటున్నాడు. తమిళంలో ఈ పాత్రను స్వామి ఎంతో గొప్పగా నటించాడని, అందుకే ఈ పాత్రను తెలుగులో కూడా ఆయనే నటిస్తే బాగుంటుందని నిర్మాత భావించిన మాట వాస్తవమేనన్నాడు. అయితే తెలుగులో ఈ పాత్ర మరింత వైవిధ్యంగా ఉంటుందని, అందువల్ల ఆ పాత్రను అరవింద్‌స్వామి చేత నటింపజేయాలని అనుకోవడం లేదని దర్శకుడు అంటున్నాడు. ఈ పాత్రను తెలుగులో మహేష్ స్పైడర్ లో విలన్ గా చేస్తున్న ఎస్‌.జె.సూర్య చేత నటింపజేయాలని భావిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. 

విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అరవింద్‌స్వామి మరలా తమిళంలో హీరో తరహా పాత్రలను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'చతురంగ వెట్టై2, భాస్కర్‌ వర్‌ రాస్కెల్‌' చిత్రాలలో లీడ్‌రోల్‌ పోషిస్తున్నాడు. దీంతో ఆయన మరలా ఇతర భాషల్లో విలన్‌ వేషాలు వేయడానికి సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. 

Director Lakshman About Bogan Telugu Version Villain:

Bogan Telugu Version Villan is Mahesh Spyder Vilan SJ Suriya

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement