'హలో' అఖిల్ వాట్ ఈజ్ దిస్..?

Wed 06th Sep 2017 07:41 PM
akhil,hello,akhil second movie,akkineni akhil,hello second look  'హలో' అఖిల్ వాట్ ఈజ్ దిస్..?
Akhil's Hello Second Look 'హలో' అఖిల్ వాట్ ఈజ్ దిస్..?
Sponsored links

అఖిల్ రెండో సినిమా విషయంలో అక్కినేని నాగార్జున.... కొడుకు సినిమా నిర్మాతగా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదటి సినిమా ఎఫెక్ట్ రెండో సినిమా మీద పడకుండా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఇక 'మనం, 24' వంటి హిట్ చిత్రాలతో వున్న విక్రమ్ కుమార్ కూడా అఖిల్ 'హలో' విషయంలో తగు జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. అఖిల్ - కళ్యాణి జంటగా తెరకెక్కుతున్న ఈచిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక 'హలో' చిత్ర ఫస్ట్ లుక్ ని టైటిల్ ని ఈ మధ్యనే విడుదల చేసిన చిత్ర యూనిట్ 'హలో' సినిమాపై మంచి అంచనాలనే పెంచగలిగింది.

అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ లో అఖిల్ ఏదో రేర్ ఫీట్ చేస్తూ ఒక ఎత్త్తైన భవనం మీద నుండి తల్లకిందులుగా వేలాడుతూ ఉండే పోస్టర్ ని విడుదల చేశారు. అప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేసారులే అనుకుంటే ఇప్పుడు 'హలో' రెండో పోస్టర్ లోను అఖిల్ అలాగే రౌడీలతో ఫైట్ చేస్తూ ఏటవాలుగా గోడమీద  కనబడుతున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లోను, సెకండ్ పోస్టర్ లోను మనకు కామన్ గా కనబడే పాయింట్ ఏమిటంటే అఖిల్ గాల్లోనే ఉండడం. మరి ఇలా రెండు పోస్టర్స్ లోను అఖిల్ గాల్లో తేలుతూ కనబడుతున్నాడు అంటే ఈ సినిమా మీద అనేక అనుమానాలు పుట్టుకొచ్చేస్తున్నాయి అంటున్నారు. 

అసలు ఈ 'హలో' సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటుంది అన్నారు . మరి ఇక్కడ అఖిల్ చేసే ఫీట్స్ చూస్తుంటే ఈ సినిమాలో అఖిల్ ఏమన్నా సూపర్ మాన్ కింద చేస్తున్నాడా లేకుంటే స్పైడర్ మాన్ కింద కనబడతాడా అనే డౌట్స్ రేజ్ చేస్తున్నారు. ఏమో 'హలో' టీజర్ వచ్చేవరకు ఇలాంటి కన్ఫ్యూజన్ లోనే జనాల్ని ఉంచేలాగా కనబడుతున్నారు.

Sponsored links

Akhil's Hello Second Look:

The latest stills of Akhil's Hello make us envisaged Akhil has some extraordinary powers with him which make him running through walls, making somersault moves on the edges of top floors of skyscrapers and so on.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019