ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No Ileana in Mahesh and Vamsi Paidipalli Movie

ఇలియానా కాదంటూ క్లారిటీ ఇచ్చేశాడు!

No Ileana in Mahesh and Vamsi Paidipalli MovieNo Ileana in Mahesh and Vamsi Paidipalli Movie

గత రెండు రోజులుగా మహేష్ బాబు - వంశీ  పైడిపల్లి కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో ఇలియానా నటిస్తుందని.. సోషల్ మీడియాలో ఒకటే కథనాలు ప్రచారం అవుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో మహేష్ సరసన ఇలియానా అయితే బావుంటుందని దర్శక నిర్మాతలు ఇలియానా ని సంప్రదించినట్టుగా న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఆ కథనాలతో నిజంగానే మహేష్ పక్కన ఇలియానా ఫైనల్ అయ్యిందని అందరు ఫిక్స్ కూడా అయ్యారు. 

అసలు వారు అలా ఫిక్స్ అవడానికి కారణం కూడా వుంది. అదేమిటంటే మహేష్ బాబు - ఇలియానా లు జంటగా 'పోకిరి' సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మళ్ళీ అలాంటి హిట్ పెయిర్ జోడి కడుతుంది అంటే అందరూ నమ్మకనే నమ్మేశారు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు గారు ఈ విషయమై స్పందించి ఇలియానా, మహేష్ పక్కన నటించడం లేదని కుండ బద్దలు కొట్టేశారు. 

అసలు ఇలియానాని ఎవరూ సంప్రదించను కూడా లేదని.. అవన్నీ ఒట్టి రూమర్లేనని దిల్ రాజు చెబుతున్న మాట. ఈ లెక్కన వంశీ - మహేష్ చిత్రానికి ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు అని మాత్రం అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Dil Raju Clarifies Mahesh and Vamsi Paidipally Heroine

ileana
mahesh babu
vamsi paidipally
dil raju
pokiri