Advertisement

నాగ్..నీవేనా ఇలా మాట్లాడేది....?

Tue 29th Aug 2017 11:15 PM
nagarjuna,arjun reddy,geethanjali,maniratnam,king nagarjuna  నాగ్..నీవేనా ఇలా మాట్లాడేది....?
Nag Praises Arjun Reddy Movie నాగ్..నీవేనా ఇలా మాట్లాడేది....?
Advertisement

హిందీ చిత్రాలలో బూతులు, లిప్‌కిస్‌లు ఉండగా తెలుగులో ఉంటే ఏమిటి? బాలీవుడ్‌, టాలీవుడ్‌ రెండు కూడా ఇండియాలోని దేశాలే కదా..! అని తన పుట్టనరోజు ఇంటర్వ్యూలో నాగార్జున 'అర్జున్‌రెడ్డి' చిత్రం గురించి చెప్పుకొచ్చాడు. మరి హిందీలోని బూతుని, ముద్దుసీన్లలను మనం కూడా తీయవచ్చు అని బాలీవుడ్‌ చెడుని మనం ఆనుసరించినట్లుగానే అక్కడ వచ్చే 'దంగల్‌' వంటి చిత్రాలను ఎందుకు తీయలేకపోతున్నారు? అనేది తెలుగు మేకర్స్‌ కాస్త దృష్టి పెడితే బాగుంటుంది. అక్కడ అద్భుతమైన చిత్రాలు, బయోపిక్‌లు, దేశభక్తి గల చిత్రాలను, మల్టీస్టారర్‌గా ఒకే ఇమేజ్‌ ఉన్న హీరోలు కూడా కలసి వినూత్న కథలను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ విషయంలో మనం బాలీవుడ్‌ నుంచి స్ఫూర్తి పొందకుండా కేవలం బూతులు, ముద్దులనే అనుకరించడం ఎలా సమంజసం? 

'హంటర్‌'ని 'బాబు బాగా బిజీ' తీసిన వారు హిందీలో వస్తున్న వినూత్న కధాంశాలను ఎందుకు రీమేక్‌ చేయడం లేదు? అసలు 'అర్జున్‌రెడ్డి' చిత్రం బాగానే ఉండవచ్చు. కానీ అంత మాత్రాన అది ట్రెండ్‌సెట్టర్‌ ఎలా అవుతుంది? కేవలం కమర్షియల్‌ సక్సెస్‌ని సినిమాకి కొలమానంగా తీసుకోవడం ఎంత వరకు సమంజసం? నాగార్జున తన 'గీతాంజలి' చిత్రంలో 'ఓం నమో నమ:' వంటి పాట కేవలం లిప్‌కిస్‌ మద్యనే పాటంతా తిరుగుతుంది. కానీ దానిలో అశ్లీలత లేదు. అశ్లీలతకు శృంగారానికి మద్య ఉన్న పలుచనైన పొరను మణితర్నం తెలుసుకుని తీశాడు. 

అలాంటి భావుకత లేకుండా సినిమాలలో బూతులు, ముద్దుసీన్లు ఉంటే మీ పిల్లలను ఆ సినిమాకి పంపకండి. 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చింది అందుకే కదా..! అనే వాదన సరైంది కాదు.. నిజంగా మైనర్లకు మద్యం అమ్మకూడడు. సిగరెట్లు అమ్మకూడదు... చెడు చిత్రాలలోకి రానివ్వకూడదు అనే సూత్రాలను మన ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోకపోవడంతో యువత కి దిశా నిర్దేశం కరువవుతుంది.  'అర్జున్‌రెడ్డి' చిత్రానికి ఎగబడుతున్న యువతలో ఎక్కువ శాతం మైనర్లే కావడం విశేషం.

ఇక 'అర్జున్‌రెడ్డి' సినిమా నాగార్జున తాను చూడలేదని అన్నాడు. సరే..మరి కనీసం ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు సందీప్‌రెడ్డి, విజయదేవరకొండలు చేసిన ప్రసంగాలు వినడానికే రోత పుట్టించాయి. మరి ఇవ్వన్నీ అయినా నాగార్జునకి కనిపించి, వినిపించాయో లేదో? అనే సందేహం రాకమానదు. 

Nag Praises Arjun Reddy Movie:

Nagarjuna Talks about Arjun Reddy Movie A Content 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement