ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi Birthday Celebrations at Sandhya Convention Center

చిరు..ఫ్యాన్స్ కి హ్యాండిస్తున్నాడా..?

ఆగష్టు 22 న చిరు బర్త్ డే కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ గత పుట్టినరోజులకు ఎప్పుడూ హడావిడి చేసే ఫ్యాన్స్ ఈ పుట్టినరోజుకి తమ హడావిడి ఇంకాస్త ఎక్కువ చెయ్యనున్నారు. ఎందుకంటే మొన్న చిరు 151 మూవీ సైలెంట్ గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో ప్రారంభమవడంతో కాస్త అప్ సెట్ అయిన ఫాన్స్.. చిరు బర్త్ డే రోజున విడుదల కాబోతున్న చిరు 151 వ లోగో కోసం, మోషన్ పోస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆరోజు రానే వచ్చేసింది. ఇక చిరంజీవికి ఈ ఆగష్టు 22 కి 62 నిండి 63 వ ఒడిలోకి అడుగుపెట్టబోతున్నాడు.

చిరు 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతుంది. అదే రోజు అంటే చిరు బర్త్ డే రోజున ఆ చిత్రానికి సంబందించిన లోగో లాంచ్, మోషన్ పోస్టర్ ని దర్శకదీరుడు రాజమౌళి చేతుల మీదుగా గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో విడుదల చేయబోతున్నారు. అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకల్ని చిరు 151  చిత్ర నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఆ సినిమాలో ఇప్పటిదాకా ఫిక్స్ అయిన నటీనటులతో పాటు టాలీవుడ్ కి చెందిన అనేకమంది పెద్దలు ఈ ఫంక్షన్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాలలోని మెగా అభిమానులు హైదరాబాద్ కి చేరుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ వేడుకలకి మెగాస్టార్ దూరంగా ఉంటాడనే టాక్ వినబడుతుంది. అభిమానుల తాకిడిని ముందే ఊహించి చిరు వ్యూహాత్మకంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయి తన బర్త్ డే ని జరుపుకోబోతున్నాడనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక మెగాస్టార్ 151 వ చిత్ర లోగో లాంచ్, మోషన్ పోస్టర్ విడుదల ఈవెంట్ ని రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు కాబట్టి చిరు లేకపోయినా పెద్ద ప్రాబ్లెమ్ లేదంటున్నారు. ఇకపోతే చిరంజీవి సరసన ఈ మూవీలో నయనతార ని ఫైనల్ చేశారని చెబుతున్నారు. అదే గనక నిజమైతే బాలకృష్ణ 102 వ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన నయన్ ని చరణ్, చిరు గనక ఈ మెగా ఈవెంట్ కి ఆహ్వానిస్తే కచ్చితంగా వస్తుందనే టాక్ కూడా వినబడుతుంది. చూద్దాం మంగళవారం ఉదయం ఏం జరగబోతుందో? 

Mega Star Chiranjeevi Not Attends His Birthday Celebrations

Chiranjeevi Birthday Celebrations at Sandhya Convention Center
chiranjeevi
uyyalavada narasimha reddy
mega fans
chiranjeevi birthday celebrations