'భరత్ అనే నేను' టీమ్ కి అవమానం..!

Sun 20th Aug 2017 03:23 PM
bharat ane nenu,mahesh babu,archeology department,lucknow,koratala siva  'భరత్ అనే నేను' టీమ్ కి అవమానం..!
Bharat Ane Nenu Shooting Stopped in Lucknow 'భరత్ అనే నేను' టీమ్ కి అవమానం..!
Sponsored links

మహేష్ బాబు, మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న 'స్పైడర్' షూటింగ్ కంప్లీట్ చేసుకుని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'భరత్ అనే నేను' కొరటాల దగ్గరకి వెళ్ళిపోయాడు. 'స్పైడర్' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి సెప్టెంబర్ 27 న విడుదలకి సిద్దమవుతుండగా.... మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల డైరెక్షన్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ - కొరటాల కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ పొలిటీషియన్ గా కనబడనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం చిత్ర టీమ్ లక్నోకి పయనమైన సంగతి తెలిసిందే. 

అయితే షూటింగ్ కోసం లక్నో వెళ్లిన చిత్ర బృందానికి అక్కడొక ఘోర అవమానం జరిగినట్టు చెబుతున్నారు. 'భరత్ అనే నేను' లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ముసబాగ్, జహీరాబాగ్ కోటలను సెలెక్ట్ చేసుకుంది చిత్ర బృందం. అక్కడ షూటింగ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సిద్ధపడుతుండగా... పురావస్తు శాఖ వారు అక్కడ షూటింగ్ జరగడానికి వీలుకాదని... అందుకు అనుమతులు లేవని చెప్పడంతో చిత్ర యూనిట్ చేసేది లేక తిరిగి హైదరాబాద్ చేరుకుందని అంటున్నారు. అక్కడ లక్నో కోటలలో ప్లాన్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు వేరే చోట షూట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుందట చిత్ర యూనిట్. 

అయితే లక్నోలో ఇలా మహేష్ అండ్ టీమ్ కి అవమానం జరగడంపై మహేష్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారంటున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇక హైదరాబాద్ కి తిరిగొచ్చిన చిత్ర యూనిట్ ఇక్కడ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని..... ఆగష్టు 23 న మరో భారీ షెడ్యూల్ కోసం రోమానియా కి వెళ్లనున్నారట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా... కైరా అద్వానీ మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

Sponsored links

Bharat Ane Nenu Shooting Stopped in Lucknow:

Archeology Department of Uttar Pradesh has stopped the Mahesh Bharat Ane Nenu shooting

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019