ఉపాసన సీక్రెట్ చెప్పేసింది..!

Thu 17th Aug 2017 04:48 PM
upasana,rakul preet singh,fitness  ఉపాసన సీక్రెట్ చెప్పేసింది..!
Upasana Inspired by Rakul Preet Singh ఉపాసన సీక్రెట్ చెప్పేసింది..!
Advertisement
Ads by CJ

తెలుగులోని హీరోయిన్లలో ఇప్పుడున్న వారిలో ఫిట్టుగా, కిక్‌నిచ్చే బాడీతో ఉండే అమ్మడు రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈమెని చూసి, ఈమె ఫిజిక్కుని మెయిన్‌టెయిన్‌ చేస్తున్న తీరు చూసి పలువురు సామాన్యులైన వారే కాదు.. తోటి నటీమణులు కూడా ఆమెలా ఉండాలని ఇన్‌స్పైర్‌ అవుతున్నారు. అంతేకాదు... ఇప్పుడు రకుల్‌ప్రీత్‌సింగ్‌ని చూసి మెగాస్టార్‌ చిరంజీవి కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల.. తాను కూడా స్ఫూర్తి పొందానని ఓపెన్‌గా ఒప్పుకుని తన గొప్పతనాన్ని చాటుకుంది. 

రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఫిట్‌నెస్‌ని, ఫిజిక్కును చూసే తాను కూడా జిమ్‌లు, స్లిమ్ గా అవ్వడానికి అవసరమైన పనులు చేసి తాను కూడా ఫిజిక్‌ పరంగా ఎంతో ఫిట్‌గా తయారైనానని ఉపాసన చెబుతోంది. గత వారం రోజులుగా ఆమె రోజు డెయిలీ ఫిట్‌నెస్‌ పేరుతో వీడియోలను రిలీజ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఆమె రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఉన్న వీడియోని ఒకటి విడుదల చేసి తనని చూసే తాను ఇన్‌స్పైర్‌ అయ్యానని వీడియో ముఖంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక రకల్‌ మాత్రమే కాదు.. ప్రస్తుతం టాలీవుడ్‌లోని పలువురు భామలు తమ ఫిజిక్‌పై దృష్టి బాగా కేంద్రీకరిస్తున్నారు. 

గతకాలం నటీమణులలాగా కాకుండా ఫిట్‌నెస్‌పై, ఆరోగ్య విషయాలపై ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. వారిలో సమంత, రాఖిఖన్నా, లావణ్య త్రిపాఠీ, తేజస్వి వంటి ఎందరో ఉన్నారు. మొత్తానికి మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ భార్యని అందునా అపోలో గ్రూప్‌ డైరెక్టర్‌కి స్ఫూర్తి కలిగించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ని మాత్రం ఎంత పొగిడినా కూడా తక్కువేనని చెప్పాలి.

Upasana Inspired by Rakul Preet Singh:

Upasana reveals her fitness Secret

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ