ఈ ‘రంగుల రాట్నం’ ఎవరి కోసం..?

Wed 09th Aug 2017 05:08 PM
akkineni akhil,nagarjuna,annapurna studios banner,raj tarun,rangula ratnam movie title  ఈ ‘రంగుల రాట్నం’ ఎవరి కోసం..?
Rangula Ratnam Movie Tetle Registered on Annapurna Studios Banner ఈ ‘రంగుల రాట్నం’ ఎవరి కోసం..?
Sponsored links

నాగార్జున నిర్మాతగా అఖిల్ కొత్త సినిమా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబందించిన ఎటువంటి అప్ డేట్ మీడియాకి దొరకడంలేదు. అసలు సినిమా టైటిల్ ఏమిటనేది.... హీరోయిన్ ఎవరనేది కూడా అస్సలు క్లారిటీ లేదు. అయినా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్స్ గా  'జున్ను, హలోగురూ ప్రేమ కోసమేరా' అనే పేర్లు బాగా ప్రచారంలోకొచ్చాయి. అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ‘రంగులరాట్నం’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.

అంటే అఖిల్ రెండో చిత్రానికి టైటిల్ ‘రంగులరాట్నం’ అనుకోవాలా? అంటే ఏమో దానికి సంబందించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సిఉంది. మరి ఒకవేళ  అఖిల్ సినిమాకి ఈ టైటిల్ కాకపోతే మరే హీరో కోసం ఈ టైటిల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌ లో రిజిస్టర్ చేయించారో? అనేదానికి కూడా ఒక వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ‘రంగులరాట్నం’ టైటిల్ హీరో రాజ్‌ తరుణ్ మూవీ కి పెడుతున్నారనే టాక్ వినబడుతుంది. 'ఉయ్యాల జంపాల' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు రాజ్ తరుణ్. సైలెంట్‌గా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదలకు సిద్దమవ్వచ్చని చెబుతున్నారు.

ఒక తమిళ మహిళ డైరెక్టర్ రాజ్ తరుణ్ చిత్రానికి స్క్రిప్ట్ అందించిందని ఇన్‌సైడ్ సమాచారం కూడా ఉంది. మరి ఈ ‘రంగులరాట్నం’ టైటిల్ అఖిల్ కోసమా? లేకుంటే రాజ్ తరుణ్ కోసమా? అనేది క్లారిటీ లేకుండా అందరిని కన్ఫ్యూజన్ లో పడేశారు. ఇకపోతే ఈ టైటిల్ ని ఖచ్చితంగా అఖిల్ సినిమాకే పెడతారని అంటున్నారు. ఎందుకంటే నిర్మాత నాగార్జున ఈసారి అఖిల్ సినిమాకి అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టాలనే యోచనలో ఉన్నాడట. అందుకే ఈ ‘రంగులరాట్నం’ టైటిల్ అఖిల్ సినిమాకే అంటూ అక్కినేని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.

Sponsored links

Rangula Ratnam Movie Tetle Registered on Annapurna Studios Banner:

Akkineni Akhil second movie with Director Vikram Kumar this movie title is not Final. Recently a name of title 'Rangula Ratnam' Registered on Annapurna Studios Banner, this title movie hero configgen Akhil or Raju Tarun?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019