ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Indian Film Festival Of Melbourne 2017

తెలుగు నుంచి ఎంపికైన చిత్రాలు ఈ రెండే..!

చారిత్రక నేపధ్యం వంటి కథతో, అద్భుతమైన సాంకేతిక విలువలతో వచ్చిన 'బాహుబలి', తక్కువ బడ్జెట్‌లో లో బడ్జెట్‌గా వచ్చిన 'పెళ్ళి చూపులు'.. ఈ రెండు చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాలను నమోదు చేశాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ఈ రెండు చిత్రాలు మరో ఘనతను సాదించనున్నాయి. ఇండియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ 2017లో ఈ రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు. 

తెలుగు నుంచి ఎంపికైన చిత్రాలు ఈ రెండే. ఇక ఇతర భాషల నుంచి కూడా విమర్శకుల ప్రశంసలు, కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రాలను ఎంపిక చేశారు. ఇక రాజమౌళి తీసిన 'బాహుబలి'కి, తరుణ్‌ భాస్కర్‌ తీసిన 'పెళ్ళి చూపులు'కి ఈ ఘనత లభించడం పట్ల అందరూ ఈ నిర్ణయంతో ఏకీభవిస్తూ ఏకాభిప్రాయం తెలుపుతుండటం విశేషం. ఇలాంటి చిత్రాల ఎంపికలో ఎప్పుడు వచ్చే విమర్శలు, ఇతర చిత్రాలకు అన్యాయం జరిగిందనే వ్యాఖ్యలు ఈసారి రాలేదు. 

ఇక ఆగష్టు రెండో వారంలో జరగనున్న ఈ వేడుకకు 'బాహుబలి' హిందీ వెర్షన్‌ నిర్మాత, ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత, ధర్మ ప్రొడక్షన్స్‌ అధినేత కరణ్‌ జోహార్‌, ఐశ్వర్యా బచ్చన్‌, కొంకణ్‌సేన్‌ శర్మలు హాజరుకానున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్‌ కోసం అప్పుడే ఏర్పాట్లు చేస్తున్నారు. రిలీజ్‌ అయి విమర్శకుల ప్రశంసలు, కమర్షియల్‌ విజయాలను సాధించిన ఈ చిత్రాలను ఇంతకాలమైనా అందరూ ఇంకా గుర్తుపెట్టుకుని ప్రశంసలు కురిపిస్తూ ఉండటం విశేషంగా చెప్పవచ్చు. 

Tollywood movies 'Baahubali' and 'pelli Choopulu'this two movies selected to indian film festival of melbourne 2017.

Indian Film Festival Of Melbourne 2017
baahubali
pelli choopulu
ss rajamouli
tarun bhaskar
tollywood movies
iffm 2017
Advertisement
Advertisement