డ్రగ్స్ కేసులో 12 మంది సెలెబ్రిటీస్ కి గాను నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు ఆరుగురు అబ్బాయిలను మాత్రమే ప్రశ్నించిన సిట్ ఇప్పుడు హీరోయిన్ ఛార్మిని తమ వద్దకు పిలిపించుకుంది. ఇప్పటివరకు హాజరైన వారు పూరి, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నాలు సెంటిమెంట్ లాంటిది ఫాలో అవుతూ వైట్ షర్ట్స్ ని ధరించి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక వీరి విచారణ అంతా సుదీర్ఘంగా అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇక ఈరోజు సిట్ ముందు హాజరైన ఛార్మి వైట్ డ్రెస్ తో కాకుండా బ్లు కలర్ టాప్ తో కొందరు బౌన్సర్లు పక్కన పెట్టుకుని మరీ వచ్చింది. సిట్ కార్యాలయంలోకి ఛార్మి.. అడుగుపెడుతున్న సమయంలో అక్కడ చాలా హడావుడి నెలకొంది. అయితే ఇంత హడావిడిలో ఛార్మి నవ్వుతూనే కనబడింది కానీ... అక్కడ కొద్దిగా మీడియా తోపులాట జరిగి ఛార్మిని ఫోకస్ చేసినప్పుడు మాత్రం ఛార్మి మోహంలో కాస్త ఆందోళన, కంగారు కనబడింది. ఇక అక్కడనుండి మహిళా పోలీసు అధికారులు ఛార్మికి రక్షణ కల్పిస్తూ లోపలకు తీసుకెళ్లారు. అక్కడ నలుగురు మహిళా అధికారుల సమక్షంలో ఛార్మి విచారణ జరగబోతుందని. ఈ విచారణలో అకున్ సబర్వాల్ గాని మరే ఇతర అధికారులు గాని పాల్గొనరని.... అకున్ తయారు చేసిన ప్రశ్నల్తోనే ఆ మహిళా అధికారులు ఛార్మిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అయితే డ్రగ్స్ డీలర్ కెల్విన్ అరెస్ట్ అయినప్పుడు కెల్విన్ ఫోన్ లో ఛార్మి ఫోన్ నెంబర్ 'ఛార్మి దాదా'గా ఫీడ్ చేసి ఉండడం, కెల్విన్ కి ఛార్మి వాట్స్ అప్ సందేశాలు పంపడం, కెల్విన్ తో ఛార్మి ఫోన్ సంభాషణలు అన్ని ఛార్మి ముందు పెట్టి ఆమెను విచారణ చేస్తారని అంటున్నారు. ఇక ఛార్మి దాదా అనే పదంపైనే సిట్ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెడతారనే ప్రచారము మొదలైంది. ఇక ఛార్మి ఈ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు తీరు బాగోలేదని హైకోర్టు కు వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఛార్మి ఇలా కోర్టుకు వెళ్లి ఆమె తప్పు చేశానని ఒప్పుకుందని ప్రచారం జోరుగా జరుగుతున్నవేళ ఇప్పుడు ఛార్మి సిట్ అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుందో అనేదాని మీద అందరికి తీవ్ర స్థాయిలో ఆసక్తి నెలకొని ఉంది.