Advertisementt

వెంకయ్యని వెళ్లగొట్టేందుకు వేసిన స్కెచ్ఛా..?

Sat 22nd Jul 2017 07:52 AM
bjp,narendra modi,bjp,venkaiah naidu,vice president  వెంకయ్యని వెళ్లగొట్టేందుకు వేసిన స్కెచ్ఛా..?
BJP Sketch on Venkaiah Naidu వెంకయ్యని వెళ్లగొట్టేందుకు వేసిన స్కెచ్ఛా..?
Advertisement
Ads by CJ

మాజీ బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంని మోదీ నడుపుతుంటే..మోదీని వెంకయ్య నడుపుతున్నాడా..అన్నట్లుగా బిజెపికి రాజీనామా చేయనంత వరకు వెంకయ్యనాయుడు కదలికలు ఉండేవి. కానీ తల్లి లాంటి పార్టీకి రాజీనామా చేసిన వెంకయ్యనాయుడు ఒకవైపు బాధ పడుతూనే..మరోవైపు ఉపరాష్ట్రపతి పదవి రేసులోకి అనుకోకుండా..అసలు ఊహించనీయకుండా అనౌన్స్‌ చేసినందుకు పొంగిపోతున్నాడు. పైకి ఇదంతా క్లియర్‌గా కనిపించినా..దీని వెనుక పెద్ద స్కెచ్‌ నడిచిందని మాత్రం పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. 

మోదీ తర్వాత బిజిపిలో ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్న పేరు వెంకయ్యనాయుడు పేరు. బిజిపిలోని కొందరు ఇది సహించలేకే..ఈ పెద్దాయనని ఎలాగైనా బయటికి పంపించాలని ఈ విధంగా ప్లాన్‌ చేసి ఉంటారా..! ఇదే నిజమైతే ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్యనాయుడుకి కష్టమే అవుతుంది. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని అంటుంటారు. అలాంటిది బిజిపిలోని వారే కావాలని ఈ విధంగా చేస్తే మాత్రం వెంకయ్య ఈ రేసులో ఓడిపోవడం ఖాయం. 

ఎందుకంటే..ప్రస్తుతం బిజెపిలో అనర్గళంగా..ఎదుటివారికి చెమటలు పట్టించగల సత్తా ఉన్న నాయకుడు వెంకయ్య. ఇలాంటి వెంకయ్యని పార్టీ నుండి అనూహ్యంగా బయటికి పంపిస్తున్నారంటే.. దీని వెనుక తప్పని సరిగా ఏదో మతలబు ఉండే ఉంటుంది. 

BJP Sketch on Venkaiah Naidu:

Venkaiah Naidu in Vice President race.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ