Advertisement

దర్శకనిర్మాత అంత ఇబ్బందుల్లో ఉన్నాడా?

Fri 21st Jul 2017 04:05 PM
director and producer yvs choudary,attempt to suicide,financial problems  దర్శకనిర్మాత అంత ఇబ్బందుల్లో ఉన్నాడా?
Y V S Chowdary Attempt to suicide? దర్శకనిర్మాత అంత ఇబ్బందుల్లో ఉన్నాడా?
Advertisement

తెలుగులో ఉన్న టాలెంటెడ్‌ మరీ ముఖ్యంగా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ దర్శకనిర్మాతగా పేరున్న నందమూరి వీరాభిమాని వైవిఎస్‌ చౌదరి. ఆయన నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన 'శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దమురారండి'తో పరిచయమై మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున-హరికృష్ణలతో 'సీతారామరాజు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కూడా తమిళ రీమేక్‌గా తయారై మంచి విజయమే సాదించింది. 

ఇక ఆతర్వాత మహేష్‌ బాబుతో 'యువరాజు' తీసి మెప్పించలేకపోయాడు. ఇక తన టేస్ట్‌కి తగ్గ చిత్రాలన తీయాలని బొమ్మరిల్లు బేనర్‌ని స్థాపించి తానే నిర్మాతగా హరికృష్ణతో 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య'వంటి చిత్రాలతో అతిపెద్ద హిట్లు కొట్టాడు. ఇక 'యువరాజు' తప్పితే అప్పటి వరకు ఆయన తీసిన అన్ని చిత్రాలలో నందమూరి హరికృష్ణ ఉన్నాడు. హరికృష్ణ వంటి నటన చేతకాని వాడినే అంత పవర్‌ఫుల్‌గా చూపించినప్పుడు ఇక బాలయ్య అయితే అదిరిపోతుందని భావించాడు. 

ఆమధ్యలోనే రామ్‌, ఇలియానాలను పరిచయం చేస్తూ ఎంతో డేరింగ్‌, అండ్‌ డాషింగ్‌గా తీసిన 'దేవదాసు' కూడా బాగా లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో బాలయ్య కూడా డేట్స్‌ ఇచ్చాడు. ఆయనతో 'భారతీయుడు' తరహాలో 'ఒక్క మగాడు' తీశాడు. ఈ చిత్రం పెద్ద బ్లాక్‌బస్టర్‌ కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో నిర్మాతగా చితికిపోయాడు. అదే సమయంలో మరలా డేట్స్‌ ఇచ్చి సాయం చేయమని బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌లను డేట్స్‌ అడిగినా వారివ్వలేదనే ప్రచారం జరిగింది. 

ఆ తర్వాత మోహన్‌బాబుతో భాగస్వామ్యంగా 'సలీం' తీశాడు. ఇది కూడా ఫల్టీ కొట్టింది. ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావించారు ఇక ఆయన మీద ఉన్న గుడ్‌విల్‌, రామ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్‌ చేయడంతో నందమూరి జెండా పీకి పవన్‌ జెండా ఎగురవేశాడు. పవన్‌ ఎంతో పెట్టుబడి పెట్టి, అన్ని విధాలుగా డేర్‌ చేసి మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ని ఆయన చేతిలో పెట్టి 'రేయ్‌' నిర్మించాడు. కానీ అప్పటికే ఆయన మీద ఫైనాన్షియర్లకు, బయ్యర్ల, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం, గుడ్‌విల్‌ కోల్పోయాడు. 

దాంతో ఆ చిత్రం ఆర్దిక కారణాల వల్ల మూలన పడింది. చివరకు సాయి నటించిన 'పిల్లా..నువ్వులేని జీవితం' అనే రెండో చిత్రం విడుదల తర్వాత 'రేయ్‌' విడుదలై అందరి నమ్మకాలను నిలబెడుతూ డిజాస్టర్‌ అయింది. దాంతో ఆయన ఇండస్ట్రీలోని నందమూరి, మెగా, ఘట్టమనేని, మంచు వంటి పెద్ద ఫ్యామిలీల నమ్మకంకోల్పోయాడు.తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నఆయన తాజాగా ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. మరి దీనిలో నిజమెంతో తెలియాల్సివుంది..!

Y V S Chowdary Attempt to suicide?:

Director and Producer YVS Choudary attempt to suicide news is coming in social media.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement