Advertisement

రజిని, శంకర్..భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు!!

Wed 19th Jul 2017 05:07 PM
rajinikanth,sankar,2.0,12 days,lyca productions  రజిని, శంకర్..భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు!!
Rajinikanth and Sankar Movie 2.0 Latest Updates రజిని, శంకర్..భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు!!
Advertisement

ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న రజినీకాంత్ '2.0' చిత్ర షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేస్తుండగా.... హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తుంది.  అయితే ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ గ్రాఫిక్స్ వర్క్ మీద దృష్టి సారించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులనే దాదాపు ఐదు నుండి ఆరు నెలల పాటు జరుపుకోనున్న ఈ చిత్రాన్ని 2018 జనవరి చివరిలో విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. 

ఇక మిగిలిన ఆ ఒక్క సాంగ్ షూట్ ని వచ్చే నెల మొదటి నుండి మొదలు పెట్టి 12 రోజుల పాటు గ్యాప్ లేకుండా చిత్రీకరిస్తారని.... ఇప్పటివరకు ఏ సాంగ్ ని ఇన్ని రోజుల పాటు చిత్రీకరణ జరపలేదని అంటున్నారు. అందుకే అతిపెద్ద పాట చిత్రీకరణ రికార్డ్ కూడా రజినీకాంత్ పేరిట నమోదు కానుంది అంటున్నారు. మరి ఇంత భారీ పాటని ఏ దేశంలో, ఎలాంటి ప్రదేశంలోనో చిత్రీకరిస్తారని అనుకుంటే పొరబాటు పడినట్లే. ఎందుకంటే ఈ పాటని ఇండోర్ లో వేసిన సెట్ లోనే ఫుల్ గ్రాఫికల్ వర్క్ తో చిత్రీకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది.  

ఇక సాంగ్ లో రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని.... ఇదివరకు శంకర్ - రజిని కాంబోలో వచ్చిన రోబో లోలాగా గ్రాండ్ లెవల్లో ఈ పాట ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో క్లైమాక్స్ ఫైట్ ని కూడా దాదాపు 12  కోట్ల భారీ ఖర్చుతో చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. మరి ఇది చూస్తుంటే రజిని సినిమా '2.0' లో అన్ని భారీగానే ఉండబోతున్నాయన్నమాట.

Rajinikanth and Sankar Movie 2.0 Latest Updates:

12 Days Shoot For Rajinikanth and Sankar's 2.0 Movie Song

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement