Advertisement

పూరి జగన్నాథ్.. ఆ వార్తల్ని ఖండించాడు!

Sun 16th Jul 2017 11:46 AM
puri jagannath,puri jagannath twitter,drugs scandal  పూరి జగన్నాథ్.. ఆ వార్తల్ని ఖండించాడు!
Puri Jagannath Statement On Tollywood Drugs Case పూరి జగన్నాథ్.. ఆ వార్తల్ని ఖండించాడు!
Advertisement

ఇప్పుడు డ్రగ్ మాఫియా మొత్తం టాలీవుడ్ చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే టాలీవుడ్ లో డ్రగ్ కేసు మొత్తం ఒకే ఒక్క డైరెక్టర్ చుట్టూనే  తిరుగుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ఈ డ్రగ్ మాఫియాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నాడని.... ఆయన క్యాంపులో ఉన్న వారే ఈ కేసులో బయటికి వచ్చారని అంటున్నారు. పూరికి అత్యంత సన్నిహితులుగా వున్న రవితేజ, ఛార్మి వంటి వారి పేర్లు మాత్రమే బయటికి రావడంతో హార్ట్ అయిన ఈ డైరెక్టర్ టాలీవుడ్ లోని పెద్ద పెద్ద వాళ్లని పట్టుకోకుండా చిన్న వాళ్ళని ఇందులోకి లాగారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

టాలీవుడ్ పెద్ద తలకాయలుగా చెప్పుకునే సురేష్ బాబు చిన్న కొడుకు, అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ, మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ వంటి వారు ఈ డ్రగ్ మాఫియాలో ఉన్నట్లు పూరి వాటిని చెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి. అసలు నిజంగా మీడియాతో నిన్నటినుండి డైరెక్ట్ గా లైవ్ లోకి రాని పూరి ఇదంతా అన్నాడని పుకారు పుట్టించేశారు. మరి నోటీసులు అందుకున్న వారంతా మాకే పాపం తెలియదంటూ మీడియాకెక్కారు. కానీ పూరి, రవితేజ వంటి వారు మారుమాట్లాడకుండా గమ్మునుండి పోయారు. అందుకే పూరి మీద లేనిపోనివి కల్పించేశారు.

ఇక పూరి కొందరి పేర్లు బయటపెట్టినట్టు వస్తున్న వార్తలను పూరీనే స్వయంగా ఖండించాడు. తనకి అస్సలు తీరిక లేదని, పైసా వసూల్ చిత్రంతో బిజీగా వున్నానని, ఎవరిని తాను బ్లేమ్ చెయ్యలేదంటూ ఒక ట్వీట్ పడేసాడు. మరి పూరి కి నోటీసులు అందాయన్న న్యూస్ స్ప్రెడ్ అయినా స్పందించని పూరి, ఇపుడు ఎదో ఒక పుకారుకి మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యాడని అంటున్నారు. కాకపోతే ఎటువంటి కాంట్రవర్సీలను పట్టించుకోకుండా పూరి ఎప్పటికప్పుడు తనపని తానూ చేసుకుపోయే రకం కాబట్టి ఇవన్నీ లైట్ తీసుకుని ఉండవచ్చు. 

Puri Jagannath Statement On Tollywood Drugs Case:

'I have not given any statement regarding anything n anyone till now. I am very busy completing my film Paisa Vasool', puri tweeted. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement