Advertisementt

నాని సారీ చెప్పింది..అందుకే..!

Mon 10th Jul 2017 09:08 PM
nani,ninnu kori,sorry,nani sorry,b c centers  నాని సారీ చెప్పింది..అందుకే..!
Nani Says Sorry to B,C Centers Audience నాని సారీ చెప్పింది..అందుకే..!
Advertisement
Ads by CJ

నాని - నివేత థామస్ - ఆది పినిశెట్టి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'నిన్ను కోరి' గత శుక్రవారం విడుదలై బాక్సాఫీసు వద్ద విజయదుందుభి మోగిస్తుంది. అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రంతో నాని మళ్ళీ బంపర్ హిట్ కొట్టాడు. వరుసగా ఏడు సినిమాల హిట్స్ తో నాని రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుండడంతో రోజురోజుకి వసూళ్లు పెంచుకుంటూ పోతుంది. అయితే ఈ చిత్రం కేవలం మల్టీఫ్లెక్స్ సినిమా అని... ఈ చిత్రం బి.సి సెంటర్స్ లో పెద్దగా ఎక్కదని విడుదలైన మొదటి షోకే టాక్ వచ్చింది.

కానీ 'నిన్ను కోరి' మాత్రం క్లాస్, మాస్ సెంటర్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. కేవలం మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన ఈ చిత్రం ఇలా బి.సి సెంటర్స్ లోను  అత్యధిక వసూళ్లు సాధించడంతో ఆ సినిమా హీరో నాని సారీ చెబుతున్నాడు. సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే... నాని 'నిన్ను కోరి' ప్రమోషన్స్ లో భాగంగా ఇది పక్కా క్లాస్ స్టోరీ అని, అందరిని మెప్పిస్తుందని చెప్పుకొచ్చాడు. ఎక్కువ రిచ్ నెస్, మాస్ ఎలెమెంట్స్ లేకపోవడంతో బి.సి సెంటర్స్ కి పెద్దగా ఎక్కదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు. 

కానీ ఇప్పుడు కలెక్షన్స్ చూస్తుంటే పరిస్థితి వేరని అర్ధమవడంతో నాని బి,సి సెంటర్ ఆడియన్స్ కి సారీ చెబుతున్నాడు. తన అంచనాలు తప్పయినందుకు ఈ సారీ..చెప్పాడన్నమాట. ఇక సెంటర్స్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వసూలు చేస్తున్న 'నిన్ను కోరి' చిత్రం నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందనడంతో అతిశయోక్తి లేదంటున్నారు.

Nani Says Sorry to B,C Centers Audience:

Nani Ninnu Kori Movie Success in All Centers. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ