మన హీరో రాజుగారి వారసుడట..!

Bellamkonda Sai Sreenivas in Jaya Janaki Nayaka Movie

Mon 03rd Jul 2017 04:54 PM
bellamkonda sai sreenivas,boyapati sreenu,jaya janaki nayaka movie,rakul preet singh  మన హీరో రాజుగారి వారసుడట..!
Bellamkonda Sai Sreenivas in Jaya Janaki Nayaka Movie మన హీరో రాజుగారి వారసుడట..!
Advertisement

ప్రస్తుతం బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా 'జయ జానకి నాయకా' చేస్తున్న సంగతి తెలిసిందే. పొయిటిక్‌ టచ్‌ ఉన్న టైటిల్‌ను, లుక్స్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ చిత్రం మెయిన్‌ పాయింట్‌ రివీల్‌ అయింది. ఇందులో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఓ రాజకుటుంబం నుంచి వచ్చే యువకునిగా, ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌గా హీరో కనిపిస్తాడు. అతను మిడిల్‌ క్లాస్‌కి చెందిన జానకి ప్రేమలో పడ్డాక ఆ ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అనేది మెయిన్‌ పాయింట్‌ అంటున్నారు. 

హీరో ఫాదర్‌గా శరత్‌కుమార్‌, సోదరునిగా నందు కనిపిస్తారని సమాచారం. ఇక ఇదేమీ కొత్త పాయింట్‌ కాదు. ఇదే కథలో మహేష్‌ శ్రీమంతుడు చిత్రం చేశాడు. ఇక బాలీవుడ్‌లో సోనమ్‌ కపూర్‌ చేసిన 'ఖూబు సూరత్‌' కూడా అలాంటి కథే. కాగా ఈ చిత్రాన్ని 'ఖూబ్‌సూరత్‌' పాయింట్‌ని మనకి తగ్గట్లుగా మార్చుకుని ఫ్రీమేక్‌ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఇందులో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటనతో అదరగొట్టిందట. 

అదే ఈ చిత్రం కనుక మెప్పిస్తే ఇప్పటికే 'రారండోయ్‌వేడుక చూద్దాం'తో పాటు ఈ 'జయ జానకి నాయకా' తో ఆమె ఇక నుంచి గ్లామర్‌ పాత్రలతో పాటు నటనకు మంచి బలమున్న కథలకు కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా 'జయ జానకి నాయకా' చిత్రం ఆగష్టు11న విడుదలకానుంది. 

Bellamkonda Sai Sreenivas in Jaya Janaki Nayaka Movie:

Boyapati Sreenu Bellamkonda Sai Srisiniwas is doing the hero in 'Jaya Janaki Nayaka'know everyone. The film has been recently revealed by the main point. Hero Bellamkonda Sai Srisinivas is a youngster and engineering student who comes from a royal family.


Loading..
Loading..
Loading..
advertisement