Advertisement

చంద్రబాబుకి ఏమైంది..ఒక వైపు లోకేష్..!??

Fri 23rd Jun 2017 09:51 PM
chandrababu naidu,nandyala speech controversy,tdp,lokesh  చంద్రబాబుకి ఏమైంది..ఒక వైపు లోకేష్..!??
Chandrababu Naidu's Warning to People చంద్రబాబుకి ఏమైంది..ఒక వైపు లోకేష్..!??
Advertisement

చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. ఒకప్పుడు ఆయన రాజనీతిజ్ఞునిగా హుందాగా మాట్లాడి దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నాడు. ఆ మధ్య తమ కులం వారు ఎక్కువ మంది పిల్లల్ని కని ఓటు బ్యాంక్‌ పెంచుకోవాలని సూచించాడు. మరోసారి ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలపై స్పందిస్తూ సీత ఎన్నిసార్లు మంటలో దూకి తన పాతివ్రత్యాన్ని చాటుకోవాలి? అని ప్రశ్నించాడు. మరోసారి వ్యవసాయం దండగ అన్నాడు. ఇలా వయసు ప్రభావమో మరోకటే, చాదస్తమే తెలీదు కానీ ఈమధ్య ఆయన మాటలు వింటుంటేనే ఈయన రాజనీతిజ్ఞుడా లేక కార్పొరేషన్‌ స్థాయి కార్పొరేటరా? అనే అనుమానం రాకమానదు. 

తాజాగా ఆయన నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నాకు ఓటు వేయకపోతే నేను ఇచ్చే పెన్షన్‌ తీసుకోవద్దు. నేనిచ్చే రేషన్‌ తీసుకోవద్దు. నేనేసిన రోడ్లపై నడవవద్దు అనే వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో ఇచ్చే పెన్షన్లు, రేషన్‌, రోడ్లపై నడిచే హక్కు ఆయనకు ఓటేయని వారికిలేదా? ఏం మాట్లాడుతున్నావు బాబూ...! మరో అడుగు ముందుకేసి నాకు ఓట్లేయని గ్రామాలను, నియోజకవర్గాలను పట్టించుకోనన్నాడు. మరో అడుగు ముందుకేసి నాకు ఒక్కో ఓటుకు 5వేలు ఇవ్వగలిగిన శక్తి ఉంది అని వ్యాఖ్యానించాడు. ఆయన సీఎం పదవిలో ఉండే ఇలా తలాతోకా లేని మాట్లాడుతున్నాడా? 

తాను ఎక్కడా మోసం చేసి సంపాదించనని, తాను నిప్పు అని, కేవలం తన భార్య, కుటుంబం చేసే హెరిటేజ్‌ వ్యాపారంలోని లాభాలతోనే తాను జీవిస్తున్నానని సెలవిచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఓటుకు 5వేలు ఎలా ఇవ్వగలడు? అంటే అంత డబ్బును, ఆయన, ఆయన బిడ్డ లోకేష్‌ అక్రమంగా సంపాదించారా? లేక వ్యాపారంలోనే సంపాదించారా? ఓటుకు 5వేలు ఇచ్చి కేవలం తమ వ్యాపారంలో వచ్చే లాభాలతోనే ఆయన ఓటుకు అంత డబ్బు ఇవ్వగలడా? 

మరి అంత ఆదాయం ఆయన తన హెరిటేజ్‌ కంపెనీ వ్యాపారం నుంచి చూపించే దమ్ముందా? ప్రజలను పట్టించుకోని మహామహులే మట్టి కొట్టుకుపోయారు. మీరెంత? కేవలం జగన్‌ చేస్తున్న వ్యూహాత్మక తప్పులే టిడిపికి ఆయుధమే గానీ టిడిపికి ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆత్మస్తుతి-పరనింద టైప్‌లో తాను, తన పిల్లోడు చేసే శృంగారం? ఇతరులు చేస్తే వ్యభిచారమా? అన్న విధంగా ఉందని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు...!

Chandrababu Naidu's Warning to People:

CBN's words, rubbed the wrong side people and even analysts.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement