Advertisement

నాగ్‌పై పంతం నెగ్గించుకునే పనిలో..!

Wed 21st Jun 2017 01:14 PM
balakrishna,nagarjuna,akhil,mokshagna nandamuri  నాగ్‌పై పంతం నెగ్గించుకునే పనిలో..!
The Cold War Between Nagarjuna and Balakrishna నాగ్‌పై పంతం నెగ్గించుకునే పనిలో..!
Advertisement

చాలా కాలంగా నాగార్జున, బాలకృష్ణల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోన్న విషయం వారి అభిమానులకే కాదు. ఇండస్ట్రీ అంతా తెలుసు. ఓ సినిమా థియేటర్‌ విషయంలో ఇది తలెత్తింది. ఇక ఇటీవల నాగ్‌, బాలయ్యలు తమ మద్య విబేధాలేమీ లేవని ప్రకటించారు. ఇది మంచి పరిణామమే. కాకపోతే ఇటీవల నాగార్జున చిన్నకొడుకు అక్కినేని అఖిల్‌ మొదటి చిత్రం 'అఖిల్‌' వచ్చినప్పుడు బాలయ్య హాట్‌కామెంట్స్‌ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 

మీ అబ్బాయి నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు? ఎవరితో? ఎలాంటి సబ్జెక్ట్‌తో? అని విలేకరులు బాలయ్యని అడిగినప్పుడు బాలయ్య త్వరలోనే చెబుతాను. కానీ అంటూనే అఖిల్‌ని, నాగ్‌ని ఉద్దేశించి నా కొడుకు మొదటి సినిమా సింపుల్‌ స్టోరీతో ఉంటుంది. మొదటి చిత్రంతోనే లోకాన్ని కాపాడే బాధ్యత నా కొడుకు తీసుకోడు.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 

ఇక అన్నట్లుగానే బాలయ్య తన వంశాకురం నందమూరి మోక్షజ్ఞను సింపుల్‌ స్టోరీతో పరిచయం చేయనున్నాడు. బాలకృష్ణ తన చిన్నతనంలో తన తండ్రి ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలలో పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. అదే సెంటిమెంట్‌తో బాలయ్య కూడా నందమూరి మోక్షజ్ఞను తన వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లోని ఓ పాత్ర ద్వారా పరిచయం చేస్తాడని, బాలయ్య తన స్వీయదర్శత్వంలో ఆరంభించి ఆపేసిన 'నర్తనశాల'ను తీసి, తన దర్శకత్వంలోనే ఆయన తన కుమారుడిని పరిచయం చేస్తాడని, కాదు కాదు.. సాయికొర్రపాటి నిర్మాణంలో బోయపాటి శ్రీను ద్వారా పరిచయం చేస్తాడని, కాదు.. కాదు.. తాను చేసిన సూపర్‌హిట్‌ సైన్స్‌ఫిక్షన్‌ 'ఆదిత్య 369'కిరీమెక్‌గా గానీ లేదా సీక్వెల్‌గా గానీ సింగీతం శ్రీనివాసరావు చేతుల మీదుగానే పరిచయం చేస్తాడని వార్తలు వచ్చాయి. 

ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో, డ్యాన్స్‌లు, ఫైట్స్‌, డైలాగ్‌ డెలివరీతో పాటు బాడీబిల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టి రెడీ అవుతున్నాడు. మోక్షజ్ఞ నటించే మొదటి చిత్రం ఎవ్వరి ఊహలకు అందనట్లుగా కేవలం సింపుల్‌స్టోరీ, టాలెంటెడ్‌ డైరెక్టర్‌తో చేయడానికి ఫిక్స్‌ అయి, కథను కూడా తయారు చేయించాడని, బాలయ్యకు నమ్మకాలు ఎక్కువ కనుక త్వరలో మంచి ముహూర్తం చూసుకుని, దర్శకనిర్మాతలను అనౌన్స్‌ చేయించనున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది...!

The Cold War Between Nagarjuna and Balakrishna:

For a long time, the Cold War between Nagarjuna and Balakrishna is not just about their fans. Industry knows everything. When is your boy Nandamuri Mokshagna movie opening? With whom? With any subject Balayya tell soon after the reporters asked Balayya. But it is with my son's first movie Simple Story, balayya said to Akhil and Nag. My son did not take responsibility to save the world with the first film .. Throwing the comments.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement