Advertisement

గ్రాఫిక్స్ ఉండవ్..కానీ పెద్ద సినిమానే!

Wed 21st Jun 2017 10:57 AM
ss rajamouli,baahubali,ss rajamouli nex film,vfx  గ్రాఫిక్స్ ఉండవ్..కానీ పెద్ద సినిమానే!
Rajamouli Reiterates a Film without VFX గ్రాఫిక్స్ ఉండవ్..కానీ పెద్ద సినిమానే!
Advertisement

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు... అనే ప్రశ్న చాలా రోజులు సస్పెన్స్ తో చంపేసింది. అయితే ఆ ప్రశ్నకు 'బాహుబలి ద కంక్లూజన్' తో జవాబు దొరికేసింది. ఇక ఇప్పుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఏ హీరోతో సినిమా తీస్తాడు... ఎలాంటి సినిమా తీస్తాడు అనే దాని మీద మళ్ళీ ఫుల్ సస్పెన్స్ మొదలైంది. అయితే బాహుబలిని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన రాజమౌళి నెక్స్ట్  ప్రాజెక్ట్ చిన్న బడ్జెట్ తో తెరకెక్కిస్తాడని ప్రచారం జరుగుతుంది. అలాగే హీరో ఎవరు అనే దాని మీద కూడా అదే సస్పెన్స్ కొనసాగుతుంది.

బాహుబలి చిత్రాన్ని విజువల్ ఎఫెక్ట్స్ తో గ్రాఫిక్స్ వర్క్స్ తో అదరగొట్టిన రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో గ్రాఫిక్స్ వర్క్స్ గాని, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ గాని ఉండవని సింపుల్ గా ఉంటుందని చెప్పినప్పటినుండి...  రాజమౌళి చిన్న బడ్జెట్ సినిమా తీస్తాడని ప్రచారం మొదలైంది. అయితే రాజమౌళి గ్రాఫిక్స్ గాని, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ తో సినిమా తియ్యాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుందని... అందుకే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అవి లేకుండా సినిమా తీస్తానని చెప్పాను. ఇక విజువల్ ఎఫ్ఫెక్ట్స్, గ్రాఫిక్స్ లేనంత మాత్రాన చిన్న సినిమా తీయాలని రూల్ లేదు... అవి లేకుండా కూడాపెద్ద సినిమా తియ్యొచ్చని అంటున్నాడు. 

అలాగే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం ఒక కథని రాస్తున్నాడట. ఆ కథ పూర్తి కాగానే ఆ కథకు అనుగుణంగా హీరో ఎంపిక, బడ్జెట్ ఎంపిక చేసుకుని సినిమాని పట్టాలెక్కిస్తాని చెబుతున్నాడు. తాము కథను నమ్ముకునే సినిమా చేస్తాం అని స్పష్టం చేసాడు. అదే రాజమౌళి విజయ రహస్యమని కూడా అందరికి తెలిసిన విషయమే. ఇప్పటివరకు రాజమౌళి తీసిన చిత్రాలన్నీ కథా బలంతోనే సూపర్ హిట్స్ అయ్యాయి.

Rajamouli Reiterates a Film without VFX:

Ace director SS Rajamouli reiterated to a TV news channel that he would be doing a film that has no visual effects incorporated. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement