చరణ్-ఉపాసన పెళ్లిరోజు వేడుక కూడా అక్కడే!

Thu 15th Jun 2017 05:24 PM
ram charan,upasana,rangasthalam 1985 shooting,rajahmundry,5th wedding anniversary  చరణ్-ఉపాసన పెళ్లిరోజు వేడుక కూడా అక్కడే!
Ram Charan, Upasana Five Years Of Married Life చరణ్-ఉపాసన పెళ్లిరోజు వేడుక కూడా అక్కడే!
Sponsored links

మెగాహీరో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985'  సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న సమంత కారణంగా, వడగాల్పుల కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది ఈ సినిమా. ఇక ఇప్పటివరకు పల్లెటూరి వాతావరణం కోసం కొల్లేరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. మరి ఈ చిత్రం మొత్తం పల్లెటూరి వాతావరణంలో ఉండబోయే ప్రేమ కథ కాబట్టి ఎక్కువ శాతం ఆ పల్లెటూర్లలోనే షూటింగ్ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది.

అయితే ఇక్కడ షూటింగ్ జరిగే చోట ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అదేమిటంటే ఎవరైనా తమ పెళ్లి రోజును ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ రామ్ చరణ్, సుకుమార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వలన ఆ వేడుకని చాలా సింపుల్ గా చిత్ర యూనిట్ మధ్యలో ఉపాసనతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడట.  షూటింగ్ లో  బిజీగా ఉండడంతో చరణ్ పెళ్లిరోజు వేడుకకి హైదరాబాద్ రాలేకపోయాడట. అయితే ఈ పెళ్లి రోజు కోసం ఉపాసన షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ని డిస్ట్రబ్ చేయకుండా తానే రాజమండ్రికి వెళ్లిందట. ఇక అక్కడ రామ్ చరణ్ తో కలిసి తమ ఐదవ పెళ్లిరోజును సింపుల్ గా చేసేసుకుందట. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు ఉన్న ఉపాసన ‘మిస్టర్ అండ్ మిసెస్ సి’కి ఐదేళ్లు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాల కారణంగా ఇన్నేళ్లూ సంతోషంగా గడిచాయంటూ సోషల్ మీడియాలో అందరికి కృతజ్ఞతలు తెలిపింది.  

Sponsored links

Ram Charan, Upasana Five Years Of Married Life:

Ram Charan, Upasana have entered the wedlock and it has been five wonderful years of journey for both.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019