పైసావసూల్‌ ముందు రంగస్థలం తేలిపోయింది..!

Thu 15th Jun 2017 04:53 PM
ram charan,rangasthalam 1985,balakrishna,paisa vasool,puri jagannadh,sukumar  పైసావసూల్‌ ముందు రంగస్థలం తేలిపోయింది..!
Rangasthalam Better Than Paisa Vasool పైసావసూల్‌ ముందు రంగస్థలం తేలిపోయింది..!
Sponsored links

బాలకృష్ణ, రామ్‌చరణ్‌లు చేస్తున్న తాజా చిత్రాల టైటిల్స్‌ని ఒకే రోజు అనౌన్స్‌ చేశారు. ముందుగా రామ్‌చరణ్‌, సుకుమార్‌ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రానికి 'రంగస్థలం 1985' అనే టైటిల్‌ని అనౌన్స్‌ చేస్తే..అదే రోజు కొన్ని గంటలు తర్వాత బాలకృష్ణ, పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రానికి 'పైసా వసూల్‌' అనే టైటిల్‌ని చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది. అయితే ఈ రెండు టైటిల్స్‌ కూడా మెగా, నందమూరి అభిమానుల్ని నిరాశ పరిచాయనే అంటున్నారు. 

బాలకృష్ణ సినిమాకి టైటిలే ప్రధాన ఆకర్షణ. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల టైటిల్సే..సినిమా సగం హిట్‌ కావడానికి కారణం. అలాంటిది..'పైసా వసూల్‌' అని వినగానే బాలయ్య ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. టాలీవుడ్‌లో వున్న అప్‌కమింగ్‌ హీరోలు ఇద్దరు, ముగ్గురు కలిసి చేసే చిత్రాలకు పెట్టే టైటిల్‌లా ఇది అనిపిస్తుంది. అలాగే రామ్‌చరణ్‌, సుకుమార్‌ మూవీ టైటిల్‌ కూడా అంతగా ప్రేక్షకులకి ఎక్కకపోయినా.. సుకుమార్‌ కదా..అనే ధీమా మెగా ఫ్యాన్స్‌ మైండ్‌లో ఉండిపోయింది. సుకుమార్‌ సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో.. తెలుసు కాబట్టి..మెగా ఫ్యాన్స్‌ కూడా ఈ టైటిల్‌ గురించి పెద్దగా పట్టించుకోలేదు. 

అయితే ఈ రెండు టైటిల్స్‌ ఒకే రోజు రివీలవ్వడంతో..మెగా, నందమూరి ఫ్యాన్స్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ రంగస్థలం గురించి ఎక్కడా, ఎటువంటి పాజిటివ్, నెగిటివ్‌ రెస్పాన్స్‌ రాకపోయినప్పటికీ..బాలయ్య 'పైసావసూల్‌' మాత్రం టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీ అయ్యింది. అసలు బాలయ్య సినిమాకి ఇదేం టైటిల్‌ అనే నెగిటివ్‌ టాక్‌ ముందు రామ్‌చరణ్‌ రంగస్థలం టైటిల్‌ ఊసే ఎక్కడా వినబడలేదు. 

Sponsored links

Rangasthalam Better Than Paisa Vasool:

Balakrishna and Puri Jagan Movie Title is Paisa Vasool. Ram Charan and Sukumar Movie Title is Rangasthalam 1985. Two Titles Released Same Day. 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019