Advertisementt

'జై లవ కుశ' లో కూడా ఉందంట..!

Wed 14th Jun 2017 05:56 PM
jai lava kusa,jr ntr,item song,devisri prasad,bobby  'జై లవ కుశ' లో కూడా ఉందంట..!
Item Song In Jr NTR Jai Lava Kusa 'జై లవ కుశ' లో కూడా ఉందంట..!
Advertisement
Ads by CJ

స్టార్ హీరో అని లేదు, చిన్న హీరో అని లేదు ఏ సినిమాలోనైనా ఇప్పుడు ఐటెం సాంగ్ ఉండి తీరాల్సిందే. అంతలా ఐటెం సాంగ్ సంస్కృతి టాలీవుడ్ లోనే కాదు, ప్రతి ఒక్క భాషలోనూ పాతుకుపోయింది. అభిమానులను అసలు సాంగ్స్ కన్నా తమ అభిమాన హీరో హాట్ హాట్ పాపతో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడితేనే వారికి ఊపొచ్చేస్తుంది. 'గబ్బర్ సింగ్' లో 'కెవ్వు కేక...' ఐటెం సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో 'జనతా గ్యారేజ్' లో 'పక్కా లోకల్' సాంగ్ కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఈ ఐటెం సాంగ్స్ మాస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

అయితే ఇపుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' లో కూడా ఒక ఐటెం సాంగ్ కి ప్లాన్ చేశారట. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' లో ఎన్టీఆర్.. రాశిఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లతో జోడి కడుతున్నాడు. ఇక దేవిశ్రీ సంగీతం అందిస్తున్న 'జై లవ కుశ' చిత్రానికి ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటే బావుంటుందనిపించి...... ఆ సాంగ్ ని పెడుతున్నారట. ఇప్పటికే ఓ ఐటమ్ పాటని  దేవిశ్రీ ప్రసాద్ రికార్డ్ చేశాడని సమాచారం. మరి పాటైతే రెడీ అయ్యిందట గాని ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తో సరిసమానంగా స్టెప్పులు వెయ్యగలిగిన హీరోయిన్ కోసం అప్పుడే చిత్ర యూనిట్ వేట మొదలుపెట్టిందట.

ఇక ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరిని ఆకట్టుకోవడమే కాక సినిమాపై అంచనాలు కూడా పెంచేశాయి. ఈ నెల 21 న 'జై లవ కుశ' టీజర్ ని కూడా విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. 

Item Song In Jr NTR Jai Lava Kusa:

Devisri Prasad Composed Item Song for Jr Ntr's Jai Lava Kusa Movie.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ