నాగ్ ది 25ఏళ్ల వసంతం...!

Tue 13th Jun 2017 12:53 PM
akkineni nagarjuna,akkineni amala,naga chaitanya,akhil  నాగ్ ది 25ఏళ్ల వసంతం...!
Nagarjuna is The 25 Year Old Spring నాగ్ ది 25ఏళ్ల వసంతం...!
Sponsored links

నాగార్జున హీరోగా 'విక్రమ్‌'తో పరిచమైయ్యాడు.అప్పటి నుంచి కూడా చాలా సినిమాల వరకు నాగార్జునను కేవలం ప్రేక్షకులు,అభిమానులు కేవలం దిగ్రేట్‌ ఏయన్నార్‌ వారసునిగానే చూశారు. ఇక నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాలు రెండు. అవి రాంగో పాల్‌ వర్మ తీసిన 'శివ, రెండోది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి'. 'శివ' చిత్రం నాగార్జునలోని మరో యాంగల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ చిత్రం విషయానికి వస్తే తెలుగు చలన చిత్ర పరిశ్రమను మలుపుతిప్పిన చిత్రం 'శివ'నే. 

అంతకు ముందు తెలుగు చిత్రాలు ఎన్ని విడుదలైనా, సూపర్‌ హీరోల చిత్రాలు రికార్డులు తిరగరాసినా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీతం, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌..ఇలా పలు సాంకేతిక అంశాల నైపుణ్యత, విలువల గురించి మాట్లాడుకోవడం ఈ చిత్రంతోనే మొదలైంది. అప్పటి వరకు ఉన్న ఫైట్స్‌ అండ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఒరవడిని, పాటలలో కనిపించే వైవిధ్యాన్ని, పాటల్లో, రీ రికార్డింగ్‌లకు ఉండే విశేషతను తెలియజెప్పిన చిత్రం ఇదే. ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా, కాలేజీ అమ్మాయిగా కనిపించిన అమల నాగ్‌ మనుసునే కాదు.. ఏకంగా యువతరం మనసును తోడేసింది. 

ఈ చిత్రంలో వీరిద్దరూ క్యూట్‌ కపుల్‌గా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత నాగార్జున-అమలలు కలిసి 'ప్రేమయుద్దం' 'నిర్ణయం' వంటి చిత్రాలలో నటించారు. వారిలో కూడా ప్రేమ చిగురించింది. ఖచ్చితంగా ఈ రోజుకు వారి వివాహమై 25  ఏళ్లయింది. ఈ సందర్భంగా నాగార్జున ఈ విషయాన్ని అనందంతో ట్విట్టర్‌తో ప్రస్తావించాడు. పెళ్లి తర్వాత కూడా నాగ్‌ అప్రతిహతంగా తన హీరో కెరీర్‌ను వైవిధ్యభరితమైన చిత్రాలతో రోజు రోజుకూ తన ఫాలోయింగ్‌, తన 'మన్మథుడు' ఇమేజ్‌ను పెంచుకుంటూ నేటితరం అమ్మాయిలకు కూడా గ్రీకు వీరుడిలా పేరు తెచ్చుకుంటూ తనలోని ఎనర్జీ లెవల్స్‌నే కాదు.. శారీరకంగా కూడా ఫిట్‌, మెయిన్‌టెనెస్స్‌ అంటే ఇలా చేయాలి.. అని ఎందరికో ఆదర్శవంతమవుతున్నాడు. 

తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్‌లు హీరోలుగా మారి, పెళ్లిళ్ల వయసు వచ్చినా త్వరలో సమంతకు మామ కాబోతున్నా, ఒకటి రెండేళ్లలో తాత కాబోతున్నా కూడా ఈ నవ మన్మథుడు  మాత్రం రోజు రోజుకీ గ్లామర్‌ పెంచుకుంటున్నాడు. ఇక అమల పెళ్లైన తర్వాత సినిమాలకు దూరంగా ఉండి ఇటీవల శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'లో చిన్నకీలక పాత్రలో కనిపించింది. 

ఇక ఆమె జంతు ప్రేమను చూపిస్తూ బ్లూక్రాస్‌ సంస్థకు ఇతోధిక సాయం చేస్తూ తన సామాజిక బాధ్యత తాను నెరవేరుస్తోంది. మరోవైపు నాగ్‌ని చూస్తే ఈ వయసులో కూడా తండ్రిగా కొడుకుల కెరీర్‌ను పైకి తీసుకొనిపోవడం, కథల, దర్శకుల ఎంపిక, మరో వైపు తానే హీరోగా బిజీ, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా బహుముఖప్రజ్ఞ చాటుకుంటూ ఈ వయసులో కూడా స్వీట్‌ 25లా కనిపిస్తున్నాడు అనేది వాస్తవం.  

Sponsored links

Nagarjuna is The 25 Year Old Spring:

Nagarjuna has become a hero in 'Vikram'. Since then, Nagarjuna has been viewed as just ANR's successor by audiences and fans.  They are Ram Gopal Varma's  'Shiva and the other Mani Ratnam directed 'Geetanjali'. 'Shiva' is another way of bringing the audience to Nagarjuna. The movie is about 'Shiva', which is the story of the Telugu film industry.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019