Advertisement

దాసరి.. చివరి రోజుల్లో దుస్థితి....!

Sat 10th Jun 2017 06:46 PM
dasari narayana rao,tollywood,top producer,money,dasari fare  దాసరి.. చివరి రోజుల్లో దుస్థితి....!
Dasari Ending Days Situation దాసరి.. చివరి రోజుల్లో దుస్థితి....!
Advertisement

దాసరి మేరునగర శిఖరం. ఒకానొక సమయంలో ఆయన హైదరాబాద్‌లో షూటింగ్‌ ముగించి, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే ఎందరో నిర్మాతలు ఆయన కోసం క్యూ కట్టేవారు. దాసరి ఓకే అంటే బ్లాంక్‌ చెక్‌లు ఇవ్వడానికి క్యూలో ఉండేవారు. కానీ దాసరి చివరి రోజుల్లో మాత్రం ఆయన ఆర్ధికంగా బాగా చితికిపోయాడని తెలుస్తోంది. సిబిఐ కేసుల వల్ల ఆయన ఆస్తులు ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోయాయి. ఇక ఆయన తన దగ్గర ఉన్న డబ్బును పలువురు నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు నామమాత్రపు వడ్డీకి ఇచ్చారు. ఎవరైనా చిన్న నిర్మాతలే కాదు... పెద్ద నిర్మాతలు కూడా తమ సినిమా పూర్తి చేయడానికి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే దాసరిని కలిసేవారు. ఆ విధంగా ఆయన కనీసం అగ్రిమెంట్‌, కాగితాలు కూడా లేకుండా మాట మీద నమ్మకంతో పలువురు నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు కోట్లకు కోట్లు అప్పులిచ్చాడట. 

ఓ బడా నిర్మాతకు 15కోట్లు ఇవ్వగా దాసరి చివరి రోజుల్లో ఆ నిర్మాతకు తన ఆసుపత్రి, ఆరోగ్య ఖర్చులకోసం ఫోన్‌ చేస్తే అతను కనీసం దాసరి ఫోన్‌ను కూడా ఎత్తేవాడు కాదట. ఈ బాపత్తు నిర్మాతలు, ఫైనాన్షియర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆయన చివరిరోజుల్లో తన ఇంటి ఖర్చుల నిమిత్తం తన ఇంటిని, పలు ఆస్తులను, అపార్ట్‌మెంట్లను కూడా అటాచ్‌మెంట్‌ చేశాడని సమాచారం. ఆయన ఇంటిలో ఎప్పుడు 30, 40 మంది ఉండేవారు. వారందరికీ కాఫీల నుంచి భోజనాలు, వసతి వరకు అన్ని తానే చూసుకునే వాడు. ఎవరైనా ఎందుకు అంత ఖర్చుపెడుతున్నారు? అని ప్రశ్నిస్తే నా వారి కోసమే కదా..! అనే వాడట. 

ఇక ఉదయం పత్రికను పెట్టినప్పుడు రామోజీరావు.. దాసరి ఆర్దికమూలాలను తనకున్న పలుకుబడితో దెబ్బతీశాడని కూడా సమాచారం. ఇక దాసరి నెలవారి ఇంటి ఖర్చులు, ఆయన సొంత ఖర్చులు కాకుండా అతిధులకు అందరికీ కలిపి నెలకు 30లక్షలు కూడా చాలేవి కావట. ఇక దాసరి ఇచ్చిన లెక్కాపక్కా లేని అప్పుల విషయం చాలామందికి తెలియదు. వాటికి ఆధారాలు కూడాలేవు. ఆయన చివరి క్షణాలల్లో నా అనుకున్న వారు కూడా మొహం చాటేశారు. ఇక ఆర్ధికంగా నిలబడటానికే దాసరి.. పవన్‌ కాల్షీట్స్‌ అడిగాడని సమాచారం. కానీ అంతలోనే ఆయన బహుదూరపు బాటసారిగా తనువుచాలించారు.

Dasari Ending Days Situation:

One of The Tollywood Top Producer Take huge Money From Dasari Narayana Rao

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement